Slider కవి ప్రపంచం

కరోనాని తరిమి కొడదాం

#S.Surya Prakash

సెల్ఫ్ ఐసోలేషన్

లాక్ డౌన్ ఇంప్లిమెంటేషన్

మోడీ టైంలీ డెసిషన్   

స్టేట్స్ కోఆపరేషన్

వెరసి

కరోనా ప్రివెన్షన్ , చైన్ డీ అక్టీ వేషన్

ప్రాణాలు సైతం లెక్క చేయక

అహర్నిశలు  శ్రమిస్తున్న దేవుళ్ళ ముందు

ఒంటరిదైపోతుంది కరోనా

సహకార  పరిమళాలు వెదజల్లుతున్న

మానవతా మూర్తుల ముందు

మంటలో కలిసి పోతుంది కరోనా

లేవనంటున్న కనురెప్పలకి

నమ్మకపు దారాన్ని కట్టి పైకి లేపితే

కరోనాని ఖతం చేయడం ఖాయం

వైరస్ అవుతుందిక మాయం

పౌరులారా..

ధీరత్వాన్ని నరనరాల్లో జీర్ణించుకుని

బ్రతుకు రథాన్ని లాగుదాం

ఇంట్లో నే ఉందాం

పరిశుభ్రత పాటిద్దాం

ప్రభుత్వానికి సహకరిద్దాం

మహమ్మారికి సహాయ నిరాకరణ చేస్తూ

ప్రపంచం నుండి తరిమి కొడదాం

మరి

ఆశగా అంబర వీధుల్లో విహరించాలంటే

అందించాలి (అందిస్తారా) చేయూత

చూపించాలి (చూపిస్తారా) నూతనత !!!

 -ఎస్. సూర్య ప్రకాష్

Related posts

లక్ష్యాల మేరకు ప్రగతి సాధించాలి

mamatha

ప్రధాని జన్మదినం సందర్భంగా అర్వింద్ సేవా సప్తాహం

Satyam NEWS

ట్రావెల్స్ బస్సు బోల్తా

Murali Krishna

Leave a Comment