29.7 C
Hyderabad
May 3, 2024 04: 48 AM
Slider పశ్చిమగోదావరి

వేంగి రాజుల కాలం నాటి చెరువును మాయం చేసిన పెద్దలు

#Musalla Kunta pond

ఏలూరు జిల్లా పెదవేగి మండలం బాపిరాజుగూడెం పంచాయతీలో సర్వే నంబర్ 350 లో 5 ఎకరాల 34 సెంట్లు విస్తీర్ణం లో ఉన్న వేంగి రాజుల కాలం నాటి చారిత్రాత్మకత సంతరించుకున్న చెరువుగా ప్రసిద్ధి కలిగిన ముసళ్ళ కుంట చెరువు మాయమైంది. ఈ చెరువును పూడ్చివేసి కొంత చెరువు భూమిని సరిహద్దు రైతులు ఆక్రమించి సాగుభూమిగా మార్చేసారని గ్రామ స్తులు ఆరోపిస్తున్నారు. మిగిలిన మరికొంత చెరువు భూమిని 20 ఏళ్ళ నాడు అప్పటి రాజకీయ నాయకులు

కొంతమంది గ్రామం లో తమ వర్గీయులుగా ఉన్న 9 మంది పేరున నిబంధనలకు విరుద్ధంగా అప్పటి రెవిన్యూ అధికారులకు ముడుపులు ముట్టజెప్పి అప్పటికే పూడ్చేసిన ముసళ్ళ కుంట చెరువు భూమిని సబ్ డివిజన్ చేసి పట్టాలిచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొంత కాలం తరువాత 9 మంది చేతుల్లో ఉన్న ఆ చెరువు భూమికి అప్పటి రెవిన్యూ అధికారులు ద్వారా పట్టాలు పాస్ పుస్తకాలు అక్రమం గా పొందిన ఆ భూమిని ప్రక్క రైతులకు ఐనకాడికి అమ్మి సొమ్ముచేసుకుని ముసళ్ళకుంట చెరువును అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్వం రైతులు ఆ ప్రాంతము దట్టమైన అడవిగా ఉండటం తో ఆ అడవిలో తమ పశువులను మేత మేసి


ముసళ్ళకుం ట చెరువులో నీళ్లు తాగే వని తెలిసింది. ప్రస్తుతం ఆ చెరువు ను నామరూపాలు లేకుండా సాగు భూమిగా మార్చేయడం తో పశువులు త్రాగ డానికి గుక్కెడు నీరు దొరకక అల్లాడి పోతున్నాయని పశువుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరి ఆక్రమణ లో ను .మరికొందరు చేతులు మారి సాగుభూమిగా మారిపోయిన ముసళ్ళకుంట చెరువు పరిరక్షించి చరిత్ర కలిగిన ముసళ్ళకుంట చెరువుకు పూర్వ వైభవం కల్పించి,

బావి తరాలకు ముసళ్ళకుంట విశిష్టతను తెలుసుకునే పురాతన ఆస్తి గాను, పశువు ల దాహార్తిని తీర్చే నిండు చెరువుగా అభివృద్ధి చేయాలని, ఈ ముసళ్ళకుంట చెరువుకు అతి సమీపం లో ఉన్న దున్నపోతు రాయిగా పిలువబడుతున్న వేంగి రాజుల కాలం నాటి ఒక శిలను కూడా బావి తరాలకు గుర్తుండి పోయే పురావస్తు బహుమతిగా అందించేందుకు చర్యలు చేపట్టాలని బాపిరాజుగూడెం ప్రజలు అధికారులను, రాజకీయ నాయకులను కోరుతున్నారు.

Related posts

పండిత ఉపాధ్యాయుల సమస్యలు తీర్చాలి

Bhavani

రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Satyam NEWS

బిసిలకు ఋణాల మంజురులో వివక్ష తగదు

Satyam NEWS

Leave a Comment