మళ్లీ భారీ వర్షాలు కురవబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు అక్కడడక్కడ భారీ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా ఈశాన్య దిశ నుండి చలి గాలులు వీస్తున్నాయి. ఈ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే రాయలసీమలో మాత్రం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. చలి గాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
previous post