37.2 C
Hyderabad
May 6, 2024 13: 27 PM
Slider వరంగల్

ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ పార్టీదే

#MinisterSatyavathi

రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టిఆర్ఎస్ పార్టీ ఓటర్ల నమోదుపై దృష్టి సారించింది. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఓటర్ల నమోదు మరింత ఎక్కువగా జరగాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులంతా సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.

వరంగల్ – ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ప్రస్తుతం సిట్టింగ్ పల్లా రాజేశ్వర్ రెడ్డిది కావడంతో వచ్చే ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీతో ఈ స్థానంలో విజయం సాధించాలన్నారు.

మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్, జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, మునిసిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి సత్యవతి రాథోడ్ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నిక ఏదైనా గెలుపు టిఆర్ఎస్ పార్టీదేనని అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నందున ఈ సీటు మనదే. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మరింత ఎక్కువ మెజారిటీతో విజయం సాధించాలి.

కేటీఆర్ ఇచ్చిన అంబులెన్సు రాబోతున్నది

ఏ లక్ష్య సాధన కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారో, ఆ లక్ష్య సాధన కోసం అనేక పథకాలు రూపొందించి, రచించి, అమలు చేసి ప్రతి ఒక్కరు సంతోషంగా, సుఖంగా ఉండేవిధంగా ప్రయత్నిస్తున్నారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద మహబూబాబాద్ నియోజక వర్గానికి వారి సొంత ఖర్చు 20.50 లక్షలతో అంబులెన్స్ కొనిచ్చారని తెలిపారు.

పట్టభద్రుల నియోజక వర్గ ఎన్నికల రాబోతున్నాయని, దీనికి పట్టభద్రుల ఓటర్ నమోదు చేసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 1,05,000 మంది ఉండగా మహబూబాబాద్ నుంచి దాదాపు 7000పైగా మంది ఓటర్లుగా ఉన్నారు.

ఈ సభ్యత్వం అక్టోబర్ 1 నుంచి ప్రారంభమై నవంబర్ 15వ తేదీ వరకు జరుగుతుంది. పాత ఓటర్ల జాబితా ఉండొద్దు. కొత్తగా అందరినీ మళ్లీ ఓటర్లుగా నమోదు చేయించాల్సిందే. 2017 జూన్ నాటికి పట్టభద్రులైన వారందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

Related posts

ప్రార్ధించే పెదవుల కన్న సాయం చేసే చేతులు మిన్న అన్నట్టుగ….!

Satyam NEWS

విశాఖ వేదికగా ఈనెల 21 నుంచి ప్రెసిడెంట్ ఫ్లీట్‌ రివ్యూ

Satyam NEWS

తొలి ఎమ్మెల్యే అభ్యర్ధిని ప్రకటించిన జనసేన

Bhavani

Leave a Comment