28.7 C
Hyderabad
April 26, 2024 10: 26 AM
Slider నల్గొండ

రైతాంగ పోరాట చరిత్రలో నిలిచిన గుండ్రాపల్లి

#CPINalgonda

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గుండ్రాపల్లి గ్రామ వీరులు చరిత్రలో నిలిచిపోయారని, వారి పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గ దర్శకం కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలలో భాగంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండలం గుండ్రాపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిజాం నిరంకుశత్వాన్ని నిలువరించిన చరిత్ర ఈ గ్రామానిదని అన్నారు.

12 మంది రైతులను హృదయ విదారకంగా చంపేసి సామూహికంగా బావిలో పడేసి దహనం చేసిన దుర్మార్గపు చర్య ఇక్కడ చోటు చేసుకుందని అన్నారు. సాయుధ రైతాంగ పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించారని అన్నారు.

నిజాం పాలన అడ్డుకున్న కమ్యూనిస్టులు

ప్రపంచ వ్యాప్తంగా రాజరికం, భూస్వామ్య, పెట్టుబడి దారి వ్యవస్థ ఉచ్చ స్థితిలో ఉన్న సమయంలో మార్కిజం, లెనినిజం రాకతో వాటికి బీటలు పడటం మొదలయ్యిందని, సామ్యవాదం, సమసమాజం ప్రారంభమయ్యిందన్నారు.

తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థను పెంచి పోషించిన నిజాం నవాబు పాలనను నిలవరించడంలో కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే సాధ్యమయ్యిందన్నారు. సాయుధ, గెరిల్లా పోరాటాలతో నిజాం మెడలు వంచి 1947 సెప్టెంబరు,17న ఈ ప్రాంతాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేశారని ఆయన అన్నారు.

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామచంద్రా రెడ్డి లాంటి యోధుల పోరాటాల ఫలితంగా నేడు గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయని అన్నారు. ఆ కాలంలో 3 వేల గ్రామాలను భూస్వామ్య వ్యవస్థ నుండి విముక్తి చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని అన్నారు.

ఆనాడు సాయుధ పోరాటం, కమ్యూనిష్టు పోరాటాలు లేకపోతే ఈ నాడు మనం ఇంత స్వేచ్ఛగా ఉండే వాళ్ళం కాదని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో తెలంగాణ ను సాధించుకున్న ఘనత సి పి ఐ కు దక్కుతుందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాట సమయంలో సెప్టెంబర్, 17 ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేసిన కెసిఆర్, నేడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంశాన్ని మర్చిపోవడం దురదృష్టకరమని అన్నారు.

భారతీయ జనతా పార్టీకి ఈ విషయం గురించి మాట్లాడే హక్కు లేదని పల్లా అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఉజ్జిని రత్నాకర్ రావ్, జిల్లా కార్యదర్శి నెలకంటి సత్యం, నకిరేకల్ నియోజక వర్గం ఇంచార్జి శ్రవణ్, మండల కార్యదర్శి ఎండి అక్బర్, నాయకులు బొడిగే సైదులు, జిల్లా యాదయ్య, జిల్లా సత్యం,  షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వేద విద్వ‌త్ ఆగ‌మ స‌ద‌స్సుకు మెరుగ్గా ఏర్పాట్లు

Satyam NEWS

గంటస్థంభం సాక్షిగా 60 వాహనాలపై కేసులు..

Satyam NEWS

ప్రకృతి వనంలో పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment