29.7 C
Hyderabad
May 1, 2024 03: 40 AM
Slider నల్గొండ

అభాగ్యులకు అండగా సీఎం సహాయ నిధి

MLADevarakonda

అభాగ్యులకు అండగా ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి అని నల్గొండ జిల్లా దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ కారణాలతో అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన దేవరకొండ నియోజకవర్గంలోని 72 మందికి రూ.12.74లక్షల చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని ఆయన గుర్తు చేశారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది అన్ని అన్నారు.

 ఆపదలో వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ ఫండ్ ఆసరాగా నిలుస్తుంది, బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగపర్చుకొవాలి అని ఆయన అన్నారు. టిఆర్ఎస్ పార్టీ పథకాలు దేశానికి ఆదర్శం అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు. అభివృద్ధిలో, సంక్షేమంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ ఫలం ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయని, రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్,రైతు భీమా రైతు బంధు పథకాలు,మిషన్ భగీరథ, కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యం అయిందని అయన తెలిపారు.

పేదింటి ఆడపడుచులు పెళ్లిళ్లకు లక్ష రూపాయలు, వృద్ధులకు తదితరులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 పింఛన్లు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాం అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంతో గ్రామాల రూపు రేఖలు మరాయని, ప్రజల్లో ఒక నమ్మకాన్ని భరోసాను ఈ ప్రభుత్వం నింపిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ వల్లపు రెడ్డి, శేఖర్ రెడ్డి, గోసుల అనంతగిరి,అర్వపల్లి నర్సింహా, బోలుగు రామకృష్ణ,తౌఫిక్ ఖాద్రి,బొడ్డుపల్లి కృష్ణ,ఎర్ర యాదగిరి,బాను,తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎన్నికల సంఘం తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం

Satyam NEWS

బుల్లెట్ సత్యం చిత్రం టైటిల్ & సాంగ్ లాంచ్

Satyam NEWS

తుంగభద్రలో పుణ్య‌స్నానం ఆచ‌రించిన మంత్రులు

Satyam NEWS

Leave a Comment