38.2 C
Hyderabad
April 29, 2024 14: 20 PM
Slider ప్రత్యేకం

ప్రార్ధించే పెదవుల కన్న సాయం చేసే చేతులు మిన్న అన్నట్టుగ….!

#constable

ఖాకీ రంగు డ్రస్ వేసుకున్న పోలీసులకు పాషాణ హృదయమే తప్ప…సున్నితమైన తత్వం ఉండదన్నది జగమెరిగిన సత్యం. కానీ దాన్ని కాదని… పోలీసులకు హృదయం ఉంటుంది… వాళ్ల మనస్సులు గాయపడతాయి…వాళ్ళు స్పందిస్తారు.. కరిగిపోతారని కళ్లారా చూపించారు… విజయనగరం లో ఓ ఖాకీ. అదీ ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న  కానిస్టేబుల్ సురేష్. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద  80 ఏళ్ల వయసుగల ఒక వృద్ధురాలు…. మండు టెండలో రోడ్ మీద నడవలేక ఇబ్బందులు పడుతోంది.

అదీ ఇటీవలే ఆర్.అండ్.బీ శాఖ బీటీ రోడ్ వేయడంతో  ఎండ వేడికి ముదసలి కాలు కాలిపోవటం తో ఏడుస్తుండటం… అక్కడే డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్  కానిస్టేబుల్ సురేష్ మనసు కలిచి వేసింది. వెంటనే పెద్దావిడ వద్దకు వెళ్లి.. ఎందుకు ఏడుస్తున్నారు..?ఎవరైనా కొట్టారా.. అని ప్రశ్నించారు. ఎవ్వరూ ఏమి అనలేదని ,ఎండకు  కాలు కాలిపోతున్నాయని.. అని చెప్పింది.,వెంటనే కానిస్టేబుల్ సురేష్ మనసు చలించిపోయింది… వెనువెంటనే తన జేబులోంచి క్షణం ఆలోచించకుండా..కొత్త చెప్పులు ను తీసుకువచ్చే ఆమె కు తొడిగించాడు… అలాగే..ఓ చల్లని పానీయం  తాగించి…మేము కరుడుగట్టిన ఖాకీ లమే కాదు మనస్సున్న మనుషులమే అని చేసిన పని ద్వారా చూపించారు.

Related posts

చూపులేని వారు కూడా నోట్లను చూడవచ్చు

Satyam NEWS

మైనర్ ను సేవ్ చేసిన ‘దిశ’:క్షణాల్లో ఘటనాస్థలికి ఆండ్ర పోలీసులు…!

Satyam NEWS

కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?

Bhavani

Leave a Comment