36.2 C
Hyderabad
April 27, 2024 22: 02 PM
Slider ఖమ్మం

అక్టోబర్ 4న ఎలక్టోరల్ తుది పబ్లికేషన్

#Election Commission

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అక్టోబర్ 4 న ఎలక్టోరల్ తుది పబ్లికేషన్ విడుదల చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ పై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 1439 పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు సేకరించడానికి 5 నియోజక వర్గాలలో సమావేశాలను నిర్వహించడం జరిగిందని, ఆ నివేదికలకు అనుగునంగా జిల్లాలో పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు.

నియోజక వర్గాల వారిగా ఖమ్మం 341 కేంద్రాలకు 35 కేంద్రాలను మార్పు, 4 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు, 14 క్రొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు, పాలేరు నియోజకవర్గంలో 289 కేంద్రాలలో 2 పోలింగ్ కేంద్రాలను మార్పు, 12 పేర్లు మార్పు, 4 క్రొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు, మధిర నియోజకవర్గంలో 268 కేoద్రాలలో 2 కేంద్రాలను మార్పు, పేర్లు మార్పు, వైరా నియోజకవర్గంలో 252 కేంద్రాలలో 7 కేంద్రాలను మార్పు, సత్తుపల్లి నియోజకవర్గంలో 289 కేంద్రాలకుగాను 3 కేంద్రాల మార్పు, 5 కేంద్రాల పేరు మార్పు, 2 క్రొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నట్లు ఆయన అన్నారు.

జిల్లాలో ఈవియంలపై ప్రతిఒక్కరికి స్పష్టమైన అవగాహన కల్పించే దిశగా నియోజక వర్గాలలో మొబైల్, డిమాన్షేషన్ కేంద్రాల ద్వారా ప్రత్యక్షంగా అవగాహనను కల్పించడం జరుగుతుందని తెలిపారు. అగస్టు 21న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ నిర్వహించి అగస్టు 21 నుండి సెప్టెంబర్ 19 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, అగస్టు 26, 27 మరియు సెప్టెంబర్ 2,3 తేదీలలో అభ్యంతరాలు, క్లయిమ్స్ పై స్పెషల్ క్యాంపేయిన్ నిర్వహించడం జరుగుతుందని, సెప్టెంబర్ 28న డిస్పోజల్ ఆఫ్ క్లైయిమ్స్ ఆండ్ ఆబ్జెక్షన్ నిర్వహించి అక్టోబర్ 1న అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ పబ్లికేషన్ కొరకు కమీషన్ అనుమతి తీసుకోవడం జరుగుతుందని, అక్టోబర్ 4న తుది పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ ను ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

Related posts

కేసీఆర్ పెద్ద కొడుకు అసదుద్దీన్ ఓవైసీ

Satyam NEWS

విద్యారంగ సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలి

Satyam NEWS

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే లు

Satyam NEWS

Leave a Comment