38.2 C
Hyderabad
May 3, 2024 21: 01 PM
Slider ప్రత్యేకం

పెన్షన్ విద్రోహ దినం నయవంచన సభ కు భారీగా ఉద్యోగులు….

#kadapa1

కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద పెన్షన్ మన హక్కు-పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప అనే వినాదంతో పెన్షన్ విద్రోహ దినం నయవంచన సభ కు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం పెన్షన్ విద్రోహ దినం నయవంచన సభ ను ఏపీ సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించగా,పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని రెండు లక్షల మంది ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సీపీఎస్ విధానం రద్దయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు. పాత పెన్షన్ పునరుద్ధరణ కొరకు నిర్వహించిన నయవంచన సభకు అన్ని శాఖల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

కేసీఆర్ నాయకత్వంలో చెమటచుక్కకు గౌరవం: మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

మెట్లపై నుంచి పడిపోయిన రష్యా అధ్యక్షుడు పుతిన్

Satyam NEWS

వయసు మళ్లిన వాళ్లు దేవుళ్ళతో సమానం

Satyam NEWS

Leave a Comment