28.7 C
Hyderabad
May 6, 2024 00: 31 AM
Slider నిజామాబాద్

ఉపాధి పనులను అడ్డుకున్న కబ్జాదారులు

#Villege Works

బిచ్కుంద మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో చెన్నూరు చెరువులో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. అయితే పక్కనే ఉన్న రామిరెడ్డి అనే రైతు తనకు రెండు ఎకరాల ఇరవైదు గుంటల భూమి ఉందని ఇక్కడ తవ్వడానికి వీలులేదంటూ కూలి పనులను అడ్డుకున్నారు.

దీంతో కూలీలు రైతుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయంపై సత్యంన్యూస్ తహశీల్దార్ వెంకట్రావు ఫోన్ లో వివరణ కోరగా తాను గిర్దావర్, సర్వేయర్లను  పంపి సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. చెరువులో ఎవరు పంటలు వేసినా శిక్షార్హులేనని ఉపాధి పనులను అడ్డుకోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదన్నారు. పనులు సాగనివ్వక పోవడంతో 270 మంది కూలీలు వెనుదిరిగారు.

ఈ చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాల 21గుంట ఉంది. డెబ్బై ఎకరాల వరకు సాగునీరు అందిస్తుంది. కానీ కొందరు కబ్జాదారులు చెరువును కబ్జా చేయడంతో చెరువు రూపు మారిపోయింది. దీనిపై సంబంధిత రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి చెరువులో కబ్జా  చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related posts

దశాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించాలి

Bhavani

నష్టాల్లో ఉంటే విశాఖ ఉక్కును ప్రయివేటు వాళ్లు ఎలా నడుపుతారు?

Satyam NEWS

వర్చువల్ గా 554 రైల్వే స్టేషన్ లను ప్రారంభించిన ప్రధాని

Satyam NEWS

Leave a Comment