42.2 C
Hyderabad
May 3, 2024 18: 20 PM
Slider కవి ప్రపంచం

స్వాగతిద్దామ్

Dr.S.VijayaBhaskar

కరోనా క్యా కరేగా అంటూ

దాని  ధూళి మనపై సోకనీక

తామంతా  దుమ్మై

మనకంతా దమ్మైన

పారిశుధ్య పారిశ్రామికులను

ఆరోగ్య పరిరక్షకులను

ప్రణమిల్లుదాం

చరవాణి  జాగ్రత్తల సమాచారం

సమస్తం విస్తరిద్దాం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల

సూచనలను సంచరింపజేద్దాం

రేయింబవళ్ళు కాపలా కాస్తున్న

పోలీసుల సేవలను గుర్తిద్దాం

వ్యాధితో పోరాడి గెలిచిన వారిని గేలిచేయక గెంటివేయక

బంధువుల బంధాలు నిలిపి

ఇంటిలోకి స్వాగతిద్దాం

ముత్తాతలు కలరా తో

తాతలు  గత్తర లతో

గతంలోనే గెలిచారు

 సైన్సు సెన్స్ కొద్దిగున్న…..

నేడు మనకు విజ్ఞానపు గనులున్నాయి

కరోనా  కట్టడికి జ్ఞాపకాల గదులున్నాయి

మాస్కులతో ముసుగులతో

శానిటైజర్ టైగర్ తో కట్టేద్దాం

ప్రాణదాతలైన వారి పాదపూజ

చేద్దాం

పవిత్ర భారత జాతి పరువును బతికిద్దాం.

డాక్టర్. ఎస్. విజయభాస్కర్, దిల్ సుఖ్ నగర్

Related posts

వామపక్షాల బంద్:విజయవాడలో సిపిఐ నేతల అరెస్టు

Satyam NEWS

విశ్వశాంతి

Satyam NEWS

ఈడ్పుగంటి పద్మజారాణి పంచాంగం: సత్యం న్యూస్ ప్రత్యేకం(వీడియో)

Satyam NEWS

Leave a Comment