విజయనగరం వీటీ ఆగ్రహారం నుంచీ అధికారులతో పాటు వీక్షించిన జిల్లా బీజేపీ నేతలు…!
దేశ వ్యాప్తంగా ఈరోజు 554 రైల్వే స్టేషన్లను, 1500 రోడ్-ఓవర్-బ్రిడ్జి మరియు అండర్-పాస్ లను ప ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు…. అదీ వర్చువల్ ద్వారా. అందులో భాగంగా విజయనగరం వి టి అగ్రహారం, బిసి కాలనీ, మ్యాంగో యార్డ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్నారు…రైల్వే అధికారులతో పాటు బీజేపి జాతీయ కౌన్సిల్ సభ్యులు బవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి ఇతర నేతలు.
దేశవ్యాప్తంగా అత్యంత సుందరంగా, సౌకర్యవంతంగా ఆధునీకరించిన మరియు ఆధునీకరించబోతున్న 554 రైల్వే స్టేషన్లను, 1500 రోడ్-ఓవర్-బ్రిడ్జి మరియు అండర్-పాస్ లను ఢిల్లీ నుండి వర్చువల్ ద్వారా ప్రధాని మోడీ ఒకేసారి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలకు అంకితం చేసిన ప్రధాని మోడీకి ప్రజల హర్షద్వానాలు తెలిపారు. ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమంలొ విజయనగరం మామిడి యార్డ్ నుండి మామిడి ఎగుమతుల గూర్చి, మహాకవి గురజాడ అప్పారావు గురించి ప్రస్థావించారని అన్నారు.
ఇప్పటికే ఆరు వందేభారత్ రైళ్లు, పేద ప్రజలకు ఎనిమిది జనరల్ కోచ్ లతో రెండు అమృత్ భారత్ రైళ్లు ప్రవేశపెట్టిన ఘనత మోడీగారిదని అన్నారు. ఒక అమృత్ భారత్ రైలు విజయనగరం మీదుగా బెంగళూరు వెళ్తుందని,ఇప్పటికే విజయనగరం రైల్వే స్టేషన్ అభివృద్ధి కి 35.16 కోట్లు విడుదల చేసారని అన్నారు.స్వాతంత్రం వచ్చినప్పటినుండి జరగని అభివృద్ధిని పది సంవత్సరాలలొ చేసి చూపించారని అన్నారు
భారత్ ను ప్రపంచంలొ ఒకటవ స్థానంలో నిలపడానికి, మూడవసారి ప్రధాన మంత్రిగా మనమంతా మద్దతు తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, రైల్వే అధికారులు,వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.
