40.2 C
Hyderabad
April 26, 2024 12: 21 PM
Slider ప్రపంచం

డోంట్ఇంటెర్ఫైర్:ఐరాసలో బెడిసికొట్టిన పాక్ ప్రయత్నం

pak refuse uno

కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకుంటున్నపాకిస్తాన్ కు మిత్రదేశాల నుండి మద్దతు లభించలేదు.చైనా మద్దతుతో జమ్మూ కశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో తెవనెత్తేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కశ్మీర్‌ అంశం భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక అంశంమని ఐరాస స్పష్టంతెలపడం తో చైనా నోరుమూసుకుంది. పాక్‌ చైనా కుట్రలపై భారత్‌ తీవ్ర స్థాయిలో మండిపడింది.

కుట్రలను పక్కనబెట్టి ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుపర్చే అంశంపై దృష్టి పెట్టాలని హితవు పలికింది.ఓ అఫ్రికన్‌ దేశానికి సంబంధించి ఐక్యరాజ్య భద్రతా మండలి బుధవారం రహస్య సమావేశం ఏర్పాటు చేసింది. సమావేశానికి హాజరైనా చైనా కశ్మీర్‌ అంశాన్ని కూడా చర్చించాలని ప్రతిపాదించింది. దీనికి మిగతా సభ్య దేశాలు అంగీకరించలేదు. కశ్మీర్‌ అంశం భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని తేల్చి చెప్పింది. పాక్‌కు మద్దతుగా చైనా తప్ప మరే ఇతర దేశాలు అండగా లేకపోవడం గమనార్హం.

పాకిస్తాన్‌ కుయుక్తులు ఐక్యరాజ్య సమితిలో చెల్లవని ఐరాస భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్ధీన్‌ అన్నారు. పాక్‌ నిరాధార ఆరోపణలు చేస్తూ ఐరాసను తప్పదోవ పట్టిస్తుందన్న విషయం నేటితో తేలిపోయిందన్నారు. ఈ అనుభవంతో ఇప్పటికైనా ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంపై పాక్‌ దృష్టి పెట్టాలని సూచించారు.

Related posts

వివేకా హత్య కేసు తెలంగాణ కు

Murali Krishna

తిరుమలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

Bhavani

బిచ్కుంద ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ తహశీల్దార్ కు వినతి

Satyam NEWS

Leave a Comment