37.2 C
Hyderabad
May 6, 2024 13: 01 PM
Slider హైదరాబాద్

వివాదం ఉన్న స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు

కోర్టు వివాదంలో ఉన్న స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని ఉప్పల్ రెవిన్యూ అధికారులు హెచ్చరించారు. కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ పరిధి లోని మర్రిగూడ అశోక్ నగర్ సర్వే నెంబర్ 52 లో జనప్రియ ప్రైవేట్ సంస్థ భూకబ్జాలను స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఉప్పల్ రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. సర్వేనెంబర్ 52 లో హైకోర్టు స్టేటస్కో ఉన్నందున ఎవరు కబ్జాలను కానీ నిర్మాణాలను కాని చేయకూడదని హెచ్చరించారు. ఎవరైనా కోర్టు ఉత్తర్వులు దిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్వేయర్ ఎం వెంకటేష్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ బి. సుధా పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

రఘురామ: కంట్లో నలుసు, చెప్పులో రాయి, చెవిలో జోరీగ

Satyam NEWS

కార్తీక సోమవారం శోభతో కిటకిటలాడిన కోటప్పకొండ

Satyam NEWS

అసంపూర్తి అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోని రాజకీయ పెద్దలు

Satyam NEWS

Leave a Comment