26.7 C
Hyderabad
May 3, 2024 08: 56 AM
Slider విజయనగరం

విద్యార్థులకు ఇంగ్లీషు గ్రామర్ ను సులభతరం చేసిన బిఎన్ఆర్

#VijayanagaramPolice

పాఠశాల విద్యార్ధులకు ఇంగ్లీషు గ్రామర్ ను సులభతరం చేసేందుకు ప్రత్యేకంగా రచన చేసిన బిఎన్ఆర్ ఇంగ్లీషు గ్రామర్ పుస్తకంను విజయనగరం పోలీసు సమావేశమందిరంలో విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ఆవిష్కరించారు.

పాఠశాల విద్యార్ధులు సులభతరంగా ఇంగ్లీషు గ్రామర్ ను అర్ధం చేసుకొనే విధంగా రిటైర్డ్ మండల విద్యాధికారి పార్వతీపురంకు చెందిన బేతా నాగేశ్వరరావు, బి.ఎన్.ఆర్ ఇంగ్లీషు గ్రామర్ పుస్తకాన్ని రచించారు.

ఈ ఇంగ్లీషు గ్రామర్ పుస్తకాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ – పాఠశాల దశలో విద్యార్ధులకు సులభంగా అర్ధమయ్యే విధంగా బి.ఎన్. ఆర్ ఇంగ్లీషు గ్రామర్ పుస్తకాన్ని బేతా నాగేశ్వరరావు రూపొందిచారన్నారు.

ఉపాధ్యాయునిగా, మండల విద్యాధికారిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా పాఠశాల విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బేతా నాగేశ్వరరావు ఇంగ్లీషు గ్రామర్ పుస్తకాన్ని రూపొందించడం, వాటిని వివిధ పాఠశాలల విద్యార్ధులకు ఉచితంగా అందించడం అభినందనీయ మన్నారు.

బి.ఎన్.ఆర్ ఇంగ్లీషు గ్రామర్ పుస్తక రచయిత బేతా నాగేశ్వరరావు మాట్లాడుతూ – తను ఉపాధ్యాయునిగా, మండల విద్యాధికారిగా పనిచేసిన అనుభవంతో, విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా ఇంగ్లీషు గ్రామర్ పై గతంలో మూడు పుస్తకాలు రచించానని, ప్రస్తుతం పాఠశాల విద్యార్ధులకు సులభతరంగా అర్ధమయ్యే విధంగా రూపొందించిన బి.ఎన్.ఆర్ ఇంగ్లీషు గ్రామర్ పుస్తకం పాఠశాల విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తంగాఉంటుందన్నారు. పోలీసు అధికారుల పిల్లల కోసం

పుస్తకాలను ప్రస్తుతనానికి ఇస్తున్నామని, ఇంకనూ అవసరాన్ని బట్టి మరికొన్ని పుస్తకాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కోవిడ్ వారియర్ గా జిల్లా ప్రజలకు విశేషమైన సేవలందించిన జిల్లా ఎస్పీ రాజకుమారి చేతుల

మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించడం, పోలీసు ఉద్యోగుల పిల్లలకు ఉచితంగా అందించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విజయనగరం ఎస్ ఈబి అదనపు ఎస్పీ కుమారి ఎన్. శ్రీదేవీరావు, విజయనగరం అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు, ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు, ఎఆర్ స్పీ ఎల్. శేషాద్రి, బి.ఎన్.ఆర్ ఇంగ్లీషు గ్రామర్ పుస్తక రచయత బేతా నాగేశ్వరరావు, వ్యక్తిత్వ వికాశ నిపుణులు బేతా సరేష్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

అప్పటి అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?

Bhavani

తెలంగాణలో అమలులోకి తెచ్చిన ఎయిరో ప్రాజెక్టులెన్ని?

Satyam NEWS

బివేర్: కళ్లనూ మోసం చేసే కరోనా వీడియోలు

Satyam NEWS

Leave a Comment