27.7 C
Hyderabad
April 26, 2024 06: 01 AM
Slider కడప

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలకు రక్షణ కరువైంది

TDPKadapa

రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలకు రక్షణ కరువైందని టిడిపి రాష్ట్ర కార్యదర్శి  గాజుల ఖాదర్ భాషా అన్నారు. బుధవారం ఆయన కడప జిల్లా రాయచోటి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ రాష్ట్రంలో  అరాచక పాలన కొనసాగుతోందనీ, శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో క్షీణించాయని ఆరోపించారు.

రాష్ట్రం వ్యాప్తంగా గా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో  అధికార పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగా అధికారుల మీద ఒత్తిడి చేసి టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారన్నారు.

వైసిపికి ఓటమి భయం పట్టుకుందని, అందుకోసమే రాష్ట్రంలో అనేక చోట్ల టీడీపీ మద్దతు దారులను అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

వైసిపి ఓడిన పంచాయతీలలో టీడీపీ కార్యకర్తలు మీద దాడి చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు.

ఒకపక్క గాయాలు తగిలినా ధైర్యంగా నిలబడే కార్యకర్తలు  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైసిపి నాయకులు ఎన్నో భయబ్రాంతులకు గురి చేసినా అనుకున్న శాతం కంటే టీడీపీ ఎక్కైవ స్థానాలను కైవసం చేసుకోవడం అంటే వైకాపాకు పతనం మొదలైనట్లే అన్నారు. టీడీపీకి దాదాపుగా 40శాతం ఓట్లు చేరుకోవడం పట్ల ప్రజల్లో టీడీపీ పై ఎంత అభిమానం ఉన్నదో స్పష్టంగా కనబడుతోందన్నారు.

వైసీపీ కు 151 అసెంబ్లీ సీట్లు, 50 శాతం ఓట్లు అనేది బలుపు కాదు, వాపు అని పంచాయ‌తీ ఎన్నిక‌లు తేల్చేశాయన్నారు.

బెదిరించి, భ‌య‌పెట్టి చేసుకున్న ఏక‌గ్రీవాలు తీసేస్తే తెలుగుదేశం మ‌ద్ద‌తుదారులు అంచ‌నాలకు మించిన స్థానాల్లో విజ‌యం సాధించారన్నారు.

తొలిద‌శ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో కంచుకోట ఉత్తరాంధ్ర‌లో తెలుగుదేశం పూర్వ‌వైభ‌వం వ‌చ్చేసిందన్నారు.

తెలుగుదేశం వెన్నుముఖ వెన‌క‌బ‌డిన ‌త‌ర‌గ‌తుల సంపూర్ణ‌మ‌ద్ద‌తుతో పంచాయ‌తీల్లో స‌త్తా చాటుతుందన్నారు.

20 నెల‌ల వైసిపి అరాచ‌క‌ పాల‌న‌కి పంచాయ‌తీ ఫ‌లితాలే నిద‌ర్శ‌నం అన్నారు.చెల్లెలు రాజ‌న్న రాజ్యం ప్ర‌క‌టించిన రోజే అన్న రాజారెడ్డి రాజ్యానికి పంచాయ‌తీ ఎన్నిక‌లు అడ్డుక‌ట్ట వేశాయన్నారు.

ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజారెడ్డి,  రెడ్డయ్య, కేశాపురం రెడ్డప్ప, హరి, అమర్నాథ్ రెడ్డి,గోపాల్,విశ్వనాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిసిల టికెట్లు అమ్ముకున్న రేవంత్ రెడ్డి

Satyam NEWS

శాండ్‌విచ్ దీవులలో భూకంపం: అసలు భూకంపాలు ఎలా వస్తాయి?

Satyam NEWS

క్రేన్, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరి మృతి

Satyam NEWS

Leave a Comment