40.2 C
Hyderabad
May 1, 2024 16: 22 PM
Slider వరంగల్

ములుగు పంచాయితీ అవినీతిపై విచారణ జరపాలి

#mulugu panchayati

ములుగు మేజర్ గ్రామ పంచాయతీలో గత రెండు సంవత్సరాల నుండి జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతాపార్టీ ములుగు మండల అధ్యక్షులు ఇమ్మడి రాకేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బిజెపి అధ్యక్షులు  చింతలపూడి భాస్కర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ములుగు గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు మూడు కోట్ల పనులను ఇష్టారాజ్యంగా నాణ్యత ప్రమాణాలు లేకుండా సైడ్ డ్రైనేజీ లను, సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారని, కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై ఇల్లు లేని చోట ప్రైవేట్ వెంచర్లలో రోడ్డు నిర్మాణం చేపట్టారని చెప్పారు.

నూతన ఇళ్ల నిర్మాణ విషయంలో జరిమానాల రూపంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చిన డబ్బులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని వారు ఆరోపించారు, ములుగు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఖర్చుపెట్టిన నిధులపై మరియు అభివృద్ధి పనుల పై ఉన్నత అధికారులతో ఆడిట్  చేయాలని, సంబంధిత కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు,

గ్రామపంచాయతీ పాలకవర్గం లో ఎన్నికలలో ఎన్నుకోబడిన మహిళలకు బదులు వారి యొక్క భర్తలు చేస్తున్న  ఆగడాలపైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తక్కలపెల్లి దేవేందర్ బాణాల రాజకుమార్ అన్నపరెడ్డి ప్రమోద్ రెడ్డి రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి కర్ర సాంబశివారెడ్డి, జిల్లా పదాధికారులు చల్లూరి మహేందర్,కోమ్మిరెడ్డి నరసింహారెడ్డి,మోర్చా అధ్యక్షులు జీనుకల కృష్ణాకర్ రావు, రాయి కంటి పరమేశ్వర్, దొంతి రెడ్డి రాకేష్ రెడ్డి కొత్త సురేందర్, మండల నాయకులు కోయిల కవిరాజు,ఒజ్జెల కిరణ్, బైకని రాజశేఖర్ అశోక్ కిషన్ రావు బాలాజీ యువ మోర్చా  జిల్లా నాయకులు సాని కొమ్ము హరీష్ రెడ్డి, అజ్మీర కిషోర్ నాయక్, జింకల శ్రవణ్, రెడ్డి రంజిత్ గుమ్మడి లక్ష్మణ్, ప్రవీణ్ కనుకుల అవినాష్, సిద్ధార్థ్, విష్ణను తదితరులుపాల్గొన్నారు.

Related posts

గాన గాంధర్వుడు తుది శ్వాస తీసుకున్న తీరు ఇది…

Satyam NEWS

నేతల పార్టీ ఫిరాయింపులపై స్వంత పార్టీల నుంచే పుకార్లు

Satyam NEWS

శ్మశానం లో మొక్కలు నాటిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్…!

Satyam NEWS

Leave a Comment