33.2 C
Hyderabad
May 4, 2024 02: 16 AM
Slider ప్రత్యేకం

నేతల పార్టీ ఫిరాయింపులపై స్వంత పార్టీల నుంచే పుకార్లు

#politics

తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అటు కాంగ్రెస్ నుంచి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి పెద్దఎత్తున ఫిరాయింపులు జరగబోతున్నాయనే పుకార్లు విస్తృతంగా వ్యాపించాయి. ఈ పుకార్లను ఆయా పార్టీలకు చెందిన వారే ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడం కొసమెరుపు.

తాజాగా భాజాపా నేతలు ఈటెల రాజేంద్ర, కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి పార్టీని  వీడనునున్నట్లు వదంతులు వినవచ్చాయి. చివరకు వారుభయులు తాము పార్టీని వీడడం లేదని వివరణ ఇచ్చారు. అలాగే తెలంగాణా పీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు కాంగ్రెస్ ను వీడుతున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఇది సొంత పార్టీ నుంచే ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ విషయాన్ని మంగళవారం ఢిల్లీలో జరిగిన తెలంగాణా నేతలతో ఏర్పాటు చేసిన సందర్భంగా రాహుల్ గాంధీ దృష్టికి తేవడం గమనార్హం. సొంత పార్టీల్లో టికెట్‌ దక్కకనో, పార్టీలో గుర్తింపు లేదనో ఇలా రకరకాల కారణాల వల్ల నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే పలువురు అధికార భారాసాను వీడి కాంగ్రెస్ లో చెరనునట్లు వార్తలు ప్రసార మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారన్న ఊహగానాలు జోరందుకున్నాయి. మహేందర్‌రెడ్డిపై ఇలాంటి వార్తలు రావడంతో ఆయనకు ప్రగతి భవన్‌ నుంచి పిలుపు రావడంతో ఆయన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఆయా పార్టీ నేతల పార్టీ ఫిరాయింపు వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో సంజాయిషీ ఇచ్చుకోవడం అయా పార్టీల నేతలకు తల నెప్పిగా మారింది. ఈ పుకార్లు అధికార భారాసాతో పాటు వివక్ష  బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలపై వుండడం హాట్ టాపిక్ గా మారింది.

Related posts

పులివెందులలో జగన్ ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏమిటో?!

Satyam NEWS

ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్టు ఆత్మహత్య

Satyam NEWS

చైత్ర హత్య ఘటనపై బహుజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

Satyam NEWS

Leave a Comment