29.7 C
Hyderabad
May 3, 2024 05: 13 AM
Slider ఆదిలాబాద్

ఎమ్మెల్యే కోనప్ప భూ ఆక్రమణపై తక్షణ స్పందన

Palvai Harish babu

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూ ఆక్రమణపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. తక్షణం అక్కడ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని జిల్లా పాలనాధికారికి, మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. కాగజ్ నగర్ పట్టణం నడిబొడ్డున గల సర్వే నెంబరు 147 లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేసిన ప్రభుత్వ భూమి కబ్జా విషయమై సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం వెంటనే స్పందించింది. అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణం ఫోటోలను తీసి మానవ హక్కుల కమిషన్ కు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. తక్షణం అక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా పరిపాలన అధికారికి మరియు కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ అక్రమ భూ కబ్జా విషయమై కేసు విచారణను జూన్ 29వ తేదీ 2020 నాడు చేపట్టనున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.

Related posts

రాంకీ సంస్థ నిర్వాకంతో రైతన్నల గగ్గోలు

Satyam NEWS

CVS What Are The Names Of Diabetics Medicines

Bhavani

జగన్ అన్న వచ్చాడు కరెంటు షాక్ ఇచ్చాడు

Satyam NEWS

Leave a Comment