37.2 C
Hyderabad
May 6, 2024 11: 20 AM
Slider వరంగల్

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి

#PorikaVijayakumar

ములుగు జిల్లా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్లుగా నేటి నుంచి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని విజయ్ రామ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్టోరోల్ ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

ఈనెల 1 నుంచి నవంబర్ 6 వరకు ఫామ్-18 లేక ఫామ్-19 ద్వారా ఆన్లైన్ లోగాని లేదా తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా గాని ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలన్నారు.

ఇప్పటివరకు నమోదు చేసుకున్న, చేసుకోని ప్రతి ఒక్క పట్టభద్రులు ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 15 న మొదటి, 25 న రెండో రీపబ్లికేషన్ నోటీస్ జారిచేస్తారన్నారు.

నవంబర్ 25 న డ్రాఫ్ట్, డిసెంబర్ 1 న డ్రాఫ్ట్ ఎలక్టోరోల్ పబ్లికేషన్ చేపట్టి, 12 వరకు అభ్యంతరాలు పరిష్కరించి, జనవరి 18 న తుది ఎలక్టోరోల్ ప్రచురిస్తారు.

ఓటరుగా నమోదుకు 1 నవంబర్, 2017 నాటికి డిగ్రీ పూర్తిచేసివుండాలని అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా డిగ్రీ మెమో, ఆధార్, ఓటర్ ఐడి కార్డులు, రెండు ఫోటోలు సమర్పించి ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ప్రతినిధిని ఎన్నుకునే బాధ్యత ప్రతి పౌరుడిదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయి, ఓటు హక్కును వినియోగించుకోవాలని   ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో ఎంపీటీసీలు మాచర్ల ప్రభాకర్, గొర్రె సమ్మన్న, జటోత్ లాలూ, టిఆర్ఎస్ నాయకులు సాని కొమ్ము రమేష్ రెడ్డి,పూజారి శ్రీనివాస్, మాసిపెది సత్యం రావు పాల్గొన్నారు.

Related posts

కరోనా లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం

Satyam NEWS

జాతీయ స్థాయి కబడ్డీ పోటీల విన్నర్ హర్యానా

Satyam NEWS

మరో దళితుడి కథ: వైసీపీ నేత దాష్టీకాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment