Slider కడప

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన జూనియర్ ఎన్టీఆర్ యువత

NTR Fans

కడప జిల్లా రాజంపేట మండలం బసినాయుడు గారి పల్లె దళిత వాడల్లో బుధవారం పేదవారికి జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర శాఖ అభిమానులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. రాష్ట్ర జునియర్ ఎన్టీఆర్ యువత అధ్యక్షుడు శ్రీహరి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ లో నిత్యావసర వస్తువులు ఉంచి వాటిని దళిత వాడలోని ఇంటి, ఇంటికి తిరుగుతూ పంపిణీ చేశారు. గత వారం రోజులు గా పేదలకు నిత్యావసర వస్తువులు, ఆహారం అందజేసినట్టు వారు ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు తాము ముందుటామని వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుకుమార్ చౌదరి, వంశీ, శ్రీకాంత్, తేజ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే ధ్యేయం

Satyam NEWS

పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే కాలేరు

mamatha

పార్టీ అధ్యక్షుడిలో…నడిపించే సత్తా కనిపిస్తోంది..!

Satyam NEWS

Leave a Comment