38.2 C
Hyderabad
April 29, 2024 22: 28 PM
Slider వరంగల్

ప్రయోగాత్మక నైపుణ్యాల పరీక్షను సద్వినియోగం చేసుకోవాలి

#mulugu

ములుగు జిల్లాలోని 9 నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులు సైన్స్ ప్రయోగ నైపుణ్యాలను పరీక్షించుకునేందుకు జాతీయ అన్వేషిక ప్రయోగ నైపుణ్యాల పరీక్ష లో రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనాలని జిల్లా విద్యా శాఖాధికారి జి.పాణిని కోరారు. 9 నుండి ఇంటర్ వరకు జూనియర్ విభాగం, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు సీనియర్ విభాగం గా పరిగణిస్తారు.

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో చదువుతున్న 9 మరియు 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు నమోదు చేసుకునే విధంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, విద్యార్థి విజ్ఞాన్ మంథన్ రాష్ట్ర సమన్వయకులు కందాల రామయ్య,  ములుగు జిల్లా సమన్వయకులు శిరుప సతీష్ కుమార్, జిల్లా విద్యా శాఖ కో ఆర్డినేటర్ లు బద్దం సుదర్శన్ రెడ్డి, సాంబయ్య, డి సి ఈ బీ కార్యదర్శి ఎన్నెమ్ విజయమ్మ, సహాయ కార్యదర్శి యాసం విక్రమ్ రాజ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రజనీలత లు పాల్గొన్నారు.

Related posts

ప్రకృతి వనాన్ని సందర్శించిన అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి

Satyam NEWS

ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఎంపికి ఏడాదిన్నర జైలు శిక్ష

Satyam NEWS

హోరా హోరిగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికలు

Satyam NEWS

Leave a Comment