38.2 C
Hyderabad
May 2, 2024 21: 03 PM
Slider విజయనగరం

దిశా యాప్ వినియోగంపై ప్రజలకు మరింత అవగాహన

#rajakumari IPS

దిశా యాప్ గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు విజయనగరం జిల్లాలోని పోలీసు అధికారులు, మహిళా పోలీసు కానిస్టేబుళ్లు మరియు సచివాలయ మహిళా పోలీసులతో విజయనగరం జిల్లా ఎస్పీ  రాజకుమారి  జూమ్ వీడియో కాన్ఫరెన్సుతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మహిళలను రక్షించేందుకు అన్నలా వెన్నంటే ఉండేలా దిశ మొబైల్ యాప్ ను రూపొందించిందన్నారు.

ఈ యాప్ పట్ల ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు, ఎంఎస్ పిలు, మహిళా రక్షక్, పోలీసు అధికారులు, సిబ్బంది సందేహాలను నివృత్తి చేసేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. యాప్ లోగల ఫీచర్స్, అవి పని చేసే విధానం, ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందే విధానం గురించి టెక్నికల్ సిబ్బంది సహాయంతో అవగాహన కల్పించి, సిబ్బంది సందేహాలను నివృత్తి చేసారు.

మహిళలు తమ స్మార్ట్ ఫోన్లులో దిశా మొబైల్ యాప్ ను నిక్షిప్తం చేసుకోవడం వలన తమ వ్యక్తిగత స్వేచ్ఛకు ఎటువంటి భంగం కలగదని, తమ అనుమతి లేకుండా ట్రాక్ చెయ్యడం జరగదన్న విషయాన్ని యాప్ ను డౌన్ లోడు చేసుకునే మహిళలకు స్పష్టంగా చెప్పాలన్నారు. కావున, ప్రతీ మహిళ ఎటువంటి సందేహాలను పెట్టుకోకుండా తమ స్మార్ట్ మొబైల్ లో విధిగా దిశా యాప్ ను డౌన్ లోడు చేసుకోవాలన్నారు.

ఎంఎస్ పిలు తమ పరిధిలోగల ఇళ్ళను సందర్శించి, స్మార్ట్ ఫోనుగల ప్రతీ మహిళ దిశా యాప్ ను డౌన్లోడు చేసుకొనేలా చూడాలన్నారు. మహిళలు ఆటోల్లో లేదా కార్లలో ప్రయాణిస్తున్నపుడు, డ్రైవర్లు పట్ల అనుమానం ఉంటే, యాప్ లోని ట్రాక్ మై ట్రావెల్ ను క్లిక్ చేసి, మన డెస్టినేషను పాయింట్ ను తెలిపినట్లయితే, మనము వెళ్ళే మార్గంను పోలీసులు ట్రాకింగులో పెట్టి, రక్షణగా నిలుస్తారన్న విషయాన్ని మహిళలకు తెలపాలన్నారు.

అనవసరమైన అనుమానాలతో మహిళలు దిశా యాప్ ను డిలీట్ చేయడం వలన రక్షణ పొందే అవకాశాన్ని కోల్పోతున్నారన్నారు. మహిళలు ఆపద సమయంలో ఉన్నామని భావించిన వెంటనే దిశ యాప్ లో అత్యవసర సహాయం (ఎస్ఓఎస్) బటన్ నొక్కితే వారి ఫోను నంబరు, చిరునామా, వారున్న లొకేషన్ తో సహా వారి వాయిస్ తోపాటు, 10 సెకన్ల వీడియో కూడా రికార్డ్ చేసి దిశ కమాండ్ కంట్రోల్ రూం కు పంపేలా దిశాయాప్ ను రాష్ట్ర పోలీసుశాఖ రూపకల్పన చేసిందన్నారు.

కమాండ్ కంట్రోల్ రూం నుండి సంఘటనా స్థలంకు దగ్గరలో ఉన్న పోలీసు అధికారి ఫోను నంబరుకు సమాచారం అందించి, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నంను పోలీసులు చేస్తారన్నారు. దిశా యాప్ లో అత్యవసర ఫోను నంబర్లు, పోలీసు అధికారులు, పోలీసు స్టేషన్లు నంబర్లు, ఆసుపత్రులు, ఎటిఎంల వివరాలతోపాటు, ఎస్ఓఎస్ బటన్, ట్రాక్ మై ట్రావెల్ గురించి అవగాహన కల్పించి, వినియోగించే విధానం గురించి మహిళలకు, విద్యార్ధినులకు వివరించాలన్నారు.

మన జిల్లా నుండి ఎక్కువ మంది దిశ యాప్ ను డౌన్ లోడు చేసుకొనే విధంగా ఎంఎస్ పిలు, మహిళామిత్ర, మహిళా రక్షక్, పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశించారు. ఈ జూమ్ వీడియో కాన్ఫరెన్సులో జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులు, స్టేషను హౌస్ ఆఫీసర్లు, మహిళా పోలీసులు సచివాలయ మహిళా పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

మంత్రి మల్లారెడ్డి కొడుక్కి ఛాతిలో నొప్పి

Satyam NEWS

దేశాన్ని కుదిపేస్తున్న PFI ఉగ్రవాద కార్యకలాపాలు

Satyam NEWS

శతాధిక వృద్ధుని మృతి

Bhavani

Leave a Comment