42.2 C
Hyderabad
May 3, 2024 17: 48 PM
Slider ఆదిలాబాద్

చిన్న పిల్లల పై అఘాయిత్యాలు జరగకుండా చూడాలి

#kumarambheemdistrict

సమాజంలో చిన్న పిల్లల పై అఘాయిత్యాలు జరగకుండా చూడాలని తెలంగాణ హైకోర్టు జడ్జి కే. లక్ష్మణ్ అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన పోక్సో కోర్టును ఆదివారం ఆయన ప్రారంభించారు.

జిల్లా కేంద్రానికి మొదటిసారిగా వచ్చిన ఆయనకు ఆదిలాబాద్ జిల్లా జడ్జి ఎంఆర్ సునీత అధ్యక్షతన జడ్జీలు, బార్ అసోసియేషన్ సభ్యులు గిరిజన సాంప్రదాయ గుస్సాడీ నృత్యంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలపై రోజురోజుకు పెరుగుతున్న అఘాయిత్యాలను నివారించడానికి 100 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

ప్రాంతాల్లో సుప్రీంకోర్టు పోక్సో కోర్టులు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుందని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల 220, ఆసిఫాబాద్ లో 135, నిర్మల్ లో 112, ఆదిలాబాద్ లో 165 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దానిని ఆధారంగా చేసుకొని గతంలో వర్చువల్ విధానంలో ఆదిలాబాద్ కోర్టు ప్రారంభించినట్లు తెలిపారు ప్రస్తుతం మూడు జిల్లాల్లో కూడా కోర్టులు ఆదివారం ప్రారంభించామన్నారు.

ఫోక్సో చట్టం లో మొత్తం 40 సెక్షన్లు ఉంటాయని తెలిపారు. 1992 డిసెంబర్ 11న మొట్టమొదటిసారిగా పోక్సో కోర్టు కు సంబంధించి చట్టం చేయడానికి నిర్ణయం తీసుకున్నారని, 2012లో చట్టం చేయడంతో పాటు అమెండ్మెంట్ తీసుకువచ్చారని అన్నారు. మేడ్చల్ ప్రాంతంలో 1772 కేసులు నమోదయ్యాయని ఇటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఫోక్సో కోర్టులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఆన్ లైన్ చదువులను తల్లిదండ్రులు గమనించాలి

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో చిన్నపిల్లలు విద్యాభ్యాసం కొనసాగించడానికి ఆన్లైన్ తరగతులు వింటున్నారని ఈ సాంకేతికత పెరుగుదల కూడా చిన్న పిల్లలపై అఘాయిత్యాలు పెరగడానికి కారణమయ్యాయని అన్నారు. చిన్నపిల్లలు ఆన్ లైన్ తరగతులు వినేటప్పుడు తల్లిదండ్రులు వారిని గమనిస్తూ ఉండాలని సూచించారు గతంలో రాష్ట్రంలో 10 జిల్లాలు మాత్రమే ఉండేవని ప్రస్తుతం వాటిలో జిల్లా కోర్టులు ఉన్నాయని, 33 జిల్లాల ఆవిర్భావం తర్వాత జిల్లా కోర్టులు ఏర్పాటు చేయడానికి హైకోర్టు ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేసిందన్నారు.

ఈ సబ్ కమిటీ నివేదిక సమర్పించిందని దీని ప్రకారం రానున్న రోజుల్లో కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. కోర్టులు అన్ని ఒక ప్రాంగణంలో ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ మోడల్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి నమూనా రూపకల్పన జరిగిందని రెండు మూడు రోజుల్లో హైకోర్టు వెబ్ సైట్ లో ఈ నమూనా అందుబాటులో ఉంటుందన్నారు. కొత్త జిల్లాలో స్థలం అందుబాటులో ఉన్న చోట ఈ నమూనాలో కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

పోక్సో కోర్టు ప్రారంభించడం పెద్దగా సంతోషాన్ని ఇవ్వలేదని కేసులు జీరో స్థాయికి వచ్చి అవి మూసి వేసినప్పుడు సంతోషిస్తానని తెలిపారు. ఆ దిశగా లాయర్లు కృషిచేయాలని గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే వారికి సరైన న్యాయం అందే విధంగా చూడాలన్నారు. మొదటగా చట్టంపై అవగాహన తెచ్చుకోవాలని లాయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గుస్సాడి నృత్యం లో పద్మశ్రీ సాధించిన కనకరాజును సన్మానించడం సంతోషంగా ఉందన్నారు.

అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా జడ్జి సునీత మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు నివారణ చిన్న పిల్లలపై అఘాయిత్యాలు నివారణ ఇలాంటి అంశాలపై పెద్దమొత్తంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఒక్కో నెలలో ఒక రకమైన కార్యక్రమం తీసుకుంటున్నట్లు వివరించారు.

మహిళలకు న్యాయం చేయాల్సిన బాధ్యత లాయర్లదే

జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ మాట్లాడుతూ మహిళల కేసులో న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత లాయర్ల పై ఉందన్నారు. అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో విద్య, వైద్యం లో గిరిజనులు వెనుకబడి ఉన్నారని, దీనితో బాల్య వివాహాలు చిన్న పిల్లల పై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. కోర్టు ప్రారంభంతో న్యాయం ఇంటి ముందుకు వచ్చినట్లు అయిందని దీని ద్వారా ఇటువంటివి చేసేవారు భయపడి నేరాలు తగ్గే అవకాశం ఉంటుందన్నారు.

రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఫణీంద్ర భార్గవ్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత న్యాయవాదులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. పదోన్నతుల ప్రక్రియ సులభతరం అయిందన్నారు. జిల్లా కేంద్రంలో రానున్న రోజుల్లో జిల్లా కోర్టు ఏర్పడుతుందని దీనిలో ఎటువంటి సందేహాలు లేవన్నారు  బార్ అసోసియేషన్ ఆసిఫాబాద్ అధ్యక్షుడు సతీష్ బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో లాయర్లకు ప్రత్యేకంగా గా ఇంటి స్థలాల కోసం భూమిని కేటాయించాలని కోరారు.

జిల్లా ఆవిర్భావం తర్వాత అన్ని రకాల సంస్థలు జిల్లా కేంద్రంలో ఏర్పడుతున్నాయని జుడిషియల్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూడో అదనపు జిల్లా జడ్జి నారాయణబాబు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమామహేశ్వరి, జూనియర్ సివిల్ జడ్జి షరీనా, ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు, స్త్రి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.

Related posts

11 ప్రాంతాల్లో పాదరక్షల కౌంటర్లు

Murali Krishna

విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ నోటి వెంట హిందువు ని..అన్న పదం.

Satyam NEWS

రాయచోటి లో టీడీపీ నేత పై వైసీపీ నేతల దాడి

Satyam NEWS

Leave a Comment