27.7 C
Hyderabad
May 7, 2024 10: 30 AM
Slider ఖమ్మం

అందరివాడు సున్నం రాజయ్య

#Nunna Nageswara Rao

భద్రాచలం శాసనసభ్యుడుగా మూడు సార్లు పనిచేసి అందరి మన్ననలు పొందిన గిరిజన ఆదివాసీ ముద్దు బిడ్డ సున్నం రాజయ్య అని సిపియం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు కొనియాడారు. ఖమ్మం సుందరయ్య భవన్ లో సున్నం రాజయ్య మూడవ వర్ధంతి సభ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ ప్రకాష్ అధ్యక్షతన జరిగింది.

ముందుగా రాజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నున్నా నాగేశ్వరరావు నివాళులు అర్పించారు, తరువాత సభలో ఆయన మాట్లాడుతూ గిరిజన సమస్యల పైన ప్రధానంగా వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను శాసనసలో మాట్లాడేవారని అదేవిధంగా వాటి పరిష్కారానికి ఎనలేని కృషి జరిపిన గొప్ప నేత అని తెలిపారు.

భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న రాజయ్య చేసిన అభివృద్ధి చిరస్థాయిగా నిలుస్తుందని ,మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ సున్నం రాజయ్య నిరాడంబరంగా, సామాన్య జీవితం గడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు.సీపీఐ(ఎం) పోరాటాలు, ఉధ్యమాలలో తనదైన శైలిలో సున్నం రాజయ్య పనిచేశారు. భద్రాచలం నియోజకవర్గంలో రాజయ్య చేసిన అభివృద్ధి చిరస్థాయిగా నిలుస్తోంది.

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో 1979లో సీపీఐ(ఎం) సభ్యత్వం తీసుకున్నారని, వీఆరపురం మండలంలోని చిన్నమట్టపల్లి సర్పంచ్‌గా 1988లో విజయం సాధించి పనిచేశారని, అదేవిధంగా 1994 నుంచి 2001 వరకు భద్రాచలం డివిజన్‌ సీపీఐ(ఎం) కార్యదర్శిగా పనిచేశారు.

మొదటిగా డీవైఎఫ్‌ఐ భద్రాచలం డివిజన్‌ కార్యదర్శిగానూ, అధ్యక్షునిగానూ పనిచేశారు. ఏజెన్సీలో యువతను మార్క్సిస్టు పార్టీ వైపు నడిపించడానికి మన్యంలో విల్లంబుల పోటీ, గ్రామీణ క్రీడలైన కబడ్డీ తదితర క్రీడా పోటీలు నిర్వహించి యువతలో సీపీఐ(ఎం) పట్ల అంకితభావం ఏర్పరుచుకునేలా కృషి చేశారని తెలిపారు. తనకున్న పదిహేను ఎకరాల వ్యవసాయ భూమిని సైతం గిరిజనుల చిన్నారుల చదువుకోసం ఆశ్రమపాఠశాల నిర్మాణానికి ఐదెకరాలు, కాలనీ నిర్మాణానికి మరో ఐదెకరాలు, ఊరికి చెరువు కావాల్సి వచ్చినప్పుడు మరో ఐదెకరాలు రాసిచ్చారు. ఇలా సర్వస్వం తమ తమ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు దానం చేసిన ఉదారవాది రాజయ్య అని కొనియాడారు.

భద్రాచలం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొందిన సున్నం రాజయ్య, 1999లో తొలిసారిగా భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదేవిధంగా 2004, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.భద్రాచలం ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలోనే సున్నం రాజయ్య బస్సులు, ఆటోలు సాదాసీదాగా సామాన్యునిలా ప్రయాణించేవారు. అదే విధంగా ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో తన వాణిని ప్రత్యేకంగా వినిపించేవారు.

పలు సమస్యల పరిష్కారం కోసం ఆయన పోరాటాలు, ఉద్యమాలు చేసి అసెంబ్లీ ద్వారా పలు సమస్యలకు పరిష్కారం చూపారు,అందరివాడు సున్నం రాజయ్య.భద్రాచలం ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసిన సున్నం రాజయ్య అందరివాడుగా పేరు తెచ్చుకున్నారు. అనునిత్యం ప్రజల సమస్యల కోసం పోరాటంచేస్తూ అందరివాడుగా ఉండేవారని, ఏజెన్సీకి సున్నం రాజయ్య సీపీఐ(ఎం) ద్వారా ఎన్నో పోరాటాలు,ఉద్యమాలలో భాగస్వామ్యమై చాలా చురుకుగా పాల్గొనేవారు.

భూ పోరాటాలు, తునికాకు పోరాటాలు పోలవరం నిర్వాసితుల కోసం మహాపాదయాత్ర, తమ్మినేని సైకిల్‌ యాత్ర, తదితర పోరాటాల్లో సున్నం రాజయ్య చురుగ్గా పాల్గొనేవారు. అదే విధంగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోకి వెళ్లిన విలీనం మండలాలను తిరిగి భద్రాచలంలో కలపాలని డిమాండ్‌ చేస్తూ భద్రాచలంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అదేవిధంగా విభజనల సమయంలో జిల్లా సమయంలోనూ భద్రాచలం నియోజకవర్గానికి అన్యాయం జరిగిందంటూ ఆమరణ నిరాహార దీక్ష చేశారు. సమస్యలు ప్రధానంగా ప్రాజెక్టులు, వైద్యం, విద్య తదితర సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లేవారు.

కోయ భాషలో ప్రసంగం ఐటీడీఏ పాలకమండలి, శానససభ జరిగే భారీ సభలు, సమావేశాల్లో కోయభాషలోనే మాట్లాడి, ఆదికారులు, ఆదివాసీలను ఆకట్టుకునేవారు.మాజీ శాసన సభ్యులు కుంజా బొజ్జి, భీమయ్య రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన రాజయ్య, తొలుత ‘ డీవైఎఫ్‌ఐలో చేరి, డివిజన్‌ కార్యదర్శిగా యువజన ఉద్యమంలో సుదీర్ఘకాలం పని చేశారు. 1978లో సీపీఐ(ఎం) సభ్యత్వం పొందగా, 1995లో డివిజన్‌ కార్యదర్శిగా బాధ్యతల్లో కొచ్చారు.

1985లో మావోయిస్టులు అప్పటి నాయకులు బండారు చందర్రావును, బత్తుల భీష్మారావును హతమార్చిన సందర్భంలో రాజయ్య పైనా మావోయిస్టులు దాడి చేశారని తెలిపారు.సున్నం రాజయ్య మృతి పార్టీకి తీరనిలోటని ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు తీవ్రలోటని అన్నారు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా రాజయ్య అనేక బాధ్యతల్లో పనిచేసిన గుర్తు చేశారు,

Related posts

భగవద్గీత పోటీలలో ప్రథమ స్థానం సాధించిన హుజూర్ నగర్ వాసి

Satyam NEWS

బిక్షాటనతో వినూత్న నిరసన వ్యక్తం చేసిన పంథాగాని

Satyam NEWS

రాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బందిలో కరోనా కలకలం

Sub Editor

Leave a Comment