24.7 C
Hyderabad
March 26, 2025 09: 21 AM
Slider కడప

బిక్షాటనతో వినూత్న నిరసన వ్యక్తం చేసిన పంథాగాని

#TDPLeader

రాష్ట్రానికి ఎక్కడా అప్పు కూడా పుట్టని పరిస్థితిని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలపై కడప జిల్లా రైల్వే కోడూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పంథాగాని నరసింహ ప్రసాద్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి లో ఆయన బిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన ను వ్యక్తం చేశారు.

గత ఏడాదిన్నరగా రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా కేవలం ఖర్చు మాత్రమే పెడుతున్న జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఆయన అన్నారు.

సంపాదన లేకుండా కేవలం ఖర్చు మాత్రమే చేయడం వల్ల ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని, ఇక ఆదుకునే వాళ్ళ దగ్గరకు వెళ్ళి అడ్డుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రానికి పట్టింది అని పంథాగాని అన్నారు. దీనికి సింబాలిక్ గా బిక్షాటన చేస్తూ నిరసనను వ్యక్తం చేశారు.

Related posts

ఎన్ ఏ సి శిక్షణ అభ్యర్ధులకు కుట్టుమిషన్ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శానంపూడి

Satyam NEWS

ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన

Satyam NEWS

దృశ్యం సినిమా లో మాదిరిగా విజయనగరం లో హత్య

Satyam NEWS

Leave a Comment