40.2 C
Hyderabad
April 29, 2024 16: 21 PM
Slider ప్రత్యేకం

దళిత బంధు అందరికి ఇవ్వకపోతే కేసీఆర్ ఆగ్రహానికి గురికాక తప్పదు

#malalachitanyasamiti

దళిత బంధు రాష్ట్రంలో అర్హులైన దళితులందరికి ఇవ్వకుండా తాత్సారం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని తెలంగాణ మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మూలే కేశవులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాందాసు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పై తీసుకుంటున్న నిర్ణయాలను వారు తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో  ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ  స్థానంలో ఒక్క మండలానికి మాత్రమే దళిత బంధు వర్తింప చెయ్యడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒక్క  మండలంలో మాత్రమే దళితులు ఉంటారా అని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాలల్లోని దళితులు ఓట్లు వేస్తేనే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, కేసీఅర్ ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఅర్ గుర్తు పెట్టుకోవాలన్నారు.

కేవలం కొన్ని మండలలో  దళిత బంధు ను వర్తింపజేసి మిగతా ప్రాంతాలలోని దళితులను అవమానపరుస్తున్నారా? అని వారు ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాల్లో మాల-మాదిగలలో పేదవారు ఉన్నారని గుర్తు చేశారు. కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును  అమలు పరచాలన్నారు.

ప్రతి కుటుంబానికి దళిత బంధు ను వర్తింప చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాని కోరారు. ఇందులో పథకాన్ని ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించవద్దని వారు కోరారు. అలా కాకుండా రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటూ కొందరు దళితులకే దళిత బంధు వర్తింపచేస్తే దళితుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు కేసీఅర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

మద్యం పై మందుబాబులకు తెలంగాణ సుంకo తగ్గింపు

Bhavani

నేడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం

Satyam NEWS

వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా మల్లు భట్టి ట్రాక్టర్ ర్యాలీ

Satyam NEWS

Leave a Comment