కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు భారతీయ జనతాపార్టీ నాయకురాలైన అరుణ తారకు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని బిచ్కుంద జుక్కల్ మద్నూర్ పిట్లం పెద్దకొడప్గల్ మండలాలు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధిలోనే కాకుండా అన్నింటిలో వెనుకబడిన నియోజకవర్గంగా మారిందని కావున ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ శాసన సభ్యురాలు అరుణ తార కు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినట్లయితే ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు.
గతంలో ఆమె ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొంది నప్పుడు నియోజకవర్గం లోని మారుమూల ప్రాంతాల అభివృద్ధి కూడా ఆమె కృషి చేశారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే తాము పార్టీ రాష్ట్ర అధిష్టానానికి తీర్మానం ద్వారా తమ వినతిని మాజీ శాసన సభ్యురాలు అరుణ తారా ద్వారా అందజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో బిచ్కుందా అధ్యక్షులు పెరుగు కిష్టారెడ్డి, జూకల్ అధ్యక్షులు ప్రశాంత్ పటేల్, మద్నూర్ అధ్యక్షులు హనుమాన్లు, పిట్లం అధ్యక్షులు చంద్రయ్య స్వామి, పెద్దకొడప్గల్ అధ్యక్షులు పెండ్యాల హనుమాన్లు తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.