Slider నిజామాబాద్

రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో గోపన్పల్లి విద్యార్థిని

ches champion

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గోపన్పల్లి గ్రామానికి చెందిన జి రితిక గౌడ్ బిచ్కుంద మండల కేంద్రంలో ఓ ప్రవేటు పాఠశాలలో ఆరవ తరగతి  చదువుతున్నది. శనివారం నిజామాబాద్ జిల్లాలో  జరిగిన రాష్ట్ర స్థాయి నార్త్ జనరల్ చెస్ పోటీలలో ఆమె పాల్గొని ద్వితీయ స్థానంలో గెలుపొందింది.

ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆమె మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని గ్రామస్తులు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులు తమ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అతిపిన్న వయసులోనే రాష్ట్రస్థాయి పోటీల్లో రెండో స్థానం నిలవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆమె మార్గదర్శకంగా మారారు. ఆమె అభిరుచులకు అనుగుణంగా  తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం అందించడంతోనే తాను ఈ విజయం సాధించానని ఆమె అన్నారు.

Related posts

Breaking news: మిగ్ 21 యుద్ధ విమానం కూలి ఇద్దరు పైలట్ల వీరమరణం

Satyam NEWS

ఆ పాదయాత్ర ఫేక్… వాళ్లంతా నకిలీ రైతులే….

Satyam NEWS

ఫాక్ట్ ఫైండింగ్: ధాన్యం అమ్మే రైతులకు సౌకర్యాలు లేవు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!