37.2 C
Hyderabad
April 30, 2024 14: 17 PM
Slider ముఖ్యంశాలు

ఆగస్టు 2న స్టాఫ్ నర్సు పోస్టులకు పరీక్ష

#HEALTH

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో వివిధ విభాగాల్లో దాదాపు 5,204 స్టాఫ్‌నర్స్ పోస్టులకు రాత పరీక్ష తేదీని తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 2వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నియామక పరీక్ష ద్వారా మొత్తం 5,204 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేయనున్నారు.

హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లలోని కేంద్రాల్లో మూడు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానం (సీబీటీ)లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష సమయం 80 నిమిషాల వ్యవధి ఉంటుంది.జులై 23 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40,926 మంది అభ్యర్ధులు స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోపోస్టుకు గరిష్ఠంగా ఎనిమిది మంది పోటీపడుతున్నారు. అభ్యర్ధులకు కేటాయించిన సెషన్‌లో మాత్రమే పరీక్షకు అనుమతిస్తామని బోర్డు వెల్లడించింది.

Related posts

బాసరలో ఘనంగా ప్రారంభమైన వసంత పంచమి

Satyam NEWS

ఉక్కపోత: వాసుపల్లి గణేష్…. అక్కడ ఉండలేక… ఇక్కడకు రాలేక..

Satyam NEWS

మోడల్: నియంత్రిత సాగు విధానం దేశానికే ఆదర్శం

Satyam NEWS

Leave a Comment