27.7 C
Hyderabad
April 30, 2024 09: 27 AM
Slider విశాఖపట్నం

ఉక్కపోత: వాసుపల్లి గణేష్…. అక్కడ ఉండలేక… ఇక్కడకు రాలేక..

#vasupalliganesh

2019 ఎన్నికల్లో టీడీపీ నుండి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి గెలిచి అధికార వైకాపా లోకి ఫిరాయించిన వాసుపల్లి గణేష్ కు ఇప్పుడు తత్వం బోధపడినట్లు ఉంది. వైకాపా లో చేరిన కొంత కాలం బాగానే ఉన్నా ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారు కావడంతో పాటు పెరిగిపోయిన ముఠా తగాదాలు వాసుపల్లికి చుక్కలు చూపిస్తున్నాయి. అక్కడ నుండే టికెట్ ఆశిస్తూ సితంరాజు సుధాకర్ విస్తృత స్థాయిలో పర్యటనలు చేశారు.

ఇది గమనించిన వాసుపల్లి వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి నుండి ఉత్తరాంధ్ర బాధ్యతలు పీకేసీ తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి ఆ బాధ్యతలు అప్పగించిన తర్వాత మళ్ళీ వాసుపల్లి వర్సెస్ సితంరాజు ఇస్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరి పంచాయతీ వైవి సుబ్బారెడ్డి వద్ద కి వెళ్లగా వాసుపల్లి ని బల నిరూపణకు సిద్ధపడలని వైవి చెప్పనట్టు టాక్.

దీనితో కినుక వహించిన వాసుపల్లి రాజీనామా లెటర్ ని విడుదల చేశారు. విడుదల చేసిన కొద్ది గంటలకే అధిష్టానం స్పందించి బుజ్జగించడం తో వాసుపల్లి శాంతి ఇంచారు. ఇది గమనించిన అధిష్టానం సితంరాజు సుధాకర్ కి ఉత్తంద్ర పట్టభద్రుల ఎం.ఎల్.సి అభ్యర్థిగా ప్రకటించారు. దీనితో వాసుపల్లి ఊపిరి పీల్చుకున్నారు. గెలుపు వైకాపా దే అని భావించి.. విస్తృత స్థాయిలో సితంరాజు సుధాకర్ గెలుపు కోసం వాసుపల్లి ప్రచారం చేశారు. కానీ సితంరాజు సుధాకర్ టీడీపీ చేతిలో ఓడిపోయారు.

మరో వైపు సితంరాజు వర్గం లాగానే కోలా గురువులు కూడా వాసుపల్లి కి పక్కలో బల్లెం లా మారారు. ఆయన కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. ఇది గమనించిన అధిష్టానం కోలా గురువులు కు ఎం.ఎల్.ఏ కోట ఎం.ఎల్.సి అభ్యర్థిగా పోటీలో నిలిపింది. అయితే అనూహ్యంగా కోలా గురువులు ఎం.ఎల్.సి గా ఓడిపోయారు. దీనితో వాసుపల్లి గణేష్ కథ మొదటికి వచ్చింది. ఎం.ఎల్.సి గా ఓడిపోయిన సితంరాజు సుధాకర్ కి పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేయడం ఏ మాత్రం ఇష్టం లేకపోయినా అధిష్టానం ఆదేశించడం తో ఆయన పోటీలో నిలబడ్డారు.

ఆయన ఎం.ఎల్ ఏ గా పోటీ చేయడానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ఎం.ఎల్.సి గా ఓడిన వెంటనే సితంరాజు తన వర్గీయులతో భేటి అయ్యారు. సితంరాజు వర్గీయులు దక్షిణ సిటు సితంరాజు రాజుకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క ఎం.ఎల్.ఏ కోట ఎం.ఎల్.సి లో ఓటమితో బంగాపడ్డ కోలా గురువులు వర్గీయులు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. కోలా గురువులు కే అసెంబ్లీ టికెట్ కేటాయించాలని అనుచరులు కోరుతున్నారు.

ఇంకో పక్క స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాస్ కుమారుడు సైతం నేను పోటీలో ఉన్నాను అంటూ ముందుకు సాగుతున్నారు. కోలా, సితంరాజు రాజు ఇద్దరు ఎం.ఎల్.సి గా గెలుస్తారు అని తనకు ఇక ఏ ఇబ్బంది లేదని అనుకున్న వాసుపల్లి కి అటు తిరిగి ఇటు తిరిగి కథ మొదటికి రావడంతో.. వాసుపల్లి ఆలోచనలో పడ్డారు.. తన రాజకీయ భవిష్యత్తు ఏమిటా అని అనుచరుల వద్ద సమాలోచనలు చేస్తున్నారు.

సొంత గూటికే పోతే ఈ తిప్పలే ఉండేవి కాదు కాదా అని వాసుపల్లి అభిమానులు, అనుచరులు చెవులు కోరుకుంటున్నారు. ఐతే ఇక్కడ టీడీపీ ఇన్ చార్జి గా గండి బాబ్జి ని నియమించింది. గండి బాబ్జి భాద్యతలు తీసుకున్న మొదటి రోజు నుండే నియోజకవర్గ నాయకులను కలుపుకుంటు ప్రచారం లో దూసుకుపోతున్నారు. అలక వహించిన వాసుపల్లి ని నగర అధ్యక్షులు పంచకర్ల రమేష్ బుజ్జగింపు చర్యలు చేపట్టారు. స్పష్టమైన హామీ ఇస్తేనే కొనసాగుతా వాసుపల్లి అన్నట్టు టాక్. ఇపుడు వాసుపల్లి గణేష్ ఇటు వైకాపా లో ఇమడలేక.. అటు టీడీపీ లోకే వెళ్లలేక( వెళ్తే ఆహ్వానిస్తారో) సైలెంట్ అయ్యారు.

పూడి రామకృష్ణ, జర్నలిస్టు, విశాఖపట్నం

Related posts

బాడీ ట్రెస్డ్:శవమై కనిపించిన సురీల్ దాబావాలా

Satyam NEWS

రాష్ట్ర రవాణా సంస్థకు రాజకీయ గ్రహణం

Satyam NEWS

పుకార్లు నమ్మవద్దు: చంద్రమోహన్ సంతోషంగా ఉన్నారు

Satyam NEWS

Leave a Comment