42.2 C
Hyderabad
April 30, 2024 17: 38 PM
Slider నిజామాబాద్

మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం

#kamareddypolice

కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని  జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, పిట్లం,బిచ్కుంద మండలాల్లో  మద్యం దుకాణాలకు దరఖాస్తులను నేటినుండి స్వీకరించనున్నట్లు బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్  ఎక్సైజ్ అధికారి సుధాకర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గతంలో సర్కిల్ పరిధిలో 8 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు సర్కిల్ పరిధిలో 10మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనుందన్నారు.

వాటిలో జనాభా ప్రాతిపదికన  మద్నూర్ మండల కేంద్రంలో 2, పిట్లం మండల కేంద్రంలో 2, జుక్కల్ మండల కేంద్రంలో 2, బిచ్కుంద మండల కేంద్రంలో2, కాగా పెద్దకొడప్గలో1, పిట్లం మండలంలోని మద్దెలచెరువు గ్రామంలో 1 ప్రభుత్వం అనుమతించిందన్నారు. వీటికి గాను పెద్దకొడపుగల్, మద్దెలచెరువు గ్రామాల్లో మద్యం దుకాణాలు 50 యాభై లక్షలు, రెండు దుకాణాల అనుమతి ఉన్న చోట 55 లక్షల రూపాయలను లైసెన్స్ ఫీజుగా ప్రభుత్వం నిర్ణయించిందని  ఆసక్తిగల వారు ఈ నెల పద్ధెనిమిది వ తేదీ వరకు  కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎక్సైజ్ సూపరిండెంట్  కార్యాలయంలో దరఖాస్తులను దాఖలు చేయాలని ఆయన సూచించారు.

వీటిలో మద్నూర్ మండల కేంద్రానికి చెందిన రెండు దుకాణాలను ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు చేయడం జరిగిందన్నారు. బిచ్కుంద మండలకేంద్రంలోని ఒక్క దుకాణానికి గౌడ సామాజికవర్గానికి రిజర్వేషన్లు ప్రకటించిందని ఆయన వివరించారు. పధ్ధెనిమిది ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ  ఆయా దుకాణాలకు సంబంధించి   దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

2౦ తేదీన రేణుకాదేవి కళ్యాణమండపం సిరిసిల్ల రోడ్డు  కామారెడ్డిలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని మద్యం దుకాణాలకు లైసెన్స్ పొందిన వారికి  గతంలో లిఫ్టింగ్ కోటా దాటిన తర్వాత  ఆరు శాతం లాభం చేకురగా ప్రస్తుతం పది శాతం లాభం చేకూరుతుందన్నారు. దరఖాస్తు విధానం పై ఏవైనా సందేహాలు సలహాలు కొరకు  బిచ్కుంద ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గౌడ్(9440902732) సంప్రదించాల్సిందిగా  ఆయన తెలిపారు. అర్హులైన వారందరూ దరఖాస్తు  చేసుకోవచ్చని  ఒక ప్రకటనలో తెలిపారు.

జి.లాలయ్య, సత్యం న్యూస్ రిపోర్టర్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

హైదరాబాద్ నుంచి ముంబయికి దూసుకెళ్లచ్చు

Satyam NEWS

నడిరోడ్డుపై నాగుపాము… నిలిచిపోయిన ట్రాఫిక్

Bhavani

ఇక అంబర్ పేట్ జర్నలిస్టుల న్యాయపోరాటం

Satyam NEWS

Leave a Comment