23.7 C
Hyderabad
May 8, 2024 04: 47 AM
Slider ప్రత్యేకం

కాంబోజి లక్ష్మీదేవి మరణించినా ఆమె కళ్ళు ప్రపంచాన్ని చూస్తాయి

#eyedonation

కడప జిల్లా పులివెందుల పట్టణం బంగారు అంగల్ల వీధి లోని కాంబోజి లక్ష్మీదేవి (65) శనివారం రాత్రి మరణించడం తో ఆమె కుమార్తెలు నాగేశ్వరి, రమాదేవి, అల్లుళ్ళు ప్రసాద్, రమేష్ బాబు నేత్రదానానికి అంగీకరిస్తూ స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు కి సమాచారం అందించారు. దాంతో నేత్రనిధి టెక్నీషియన్ హరీష్ తో కలిసి హుటాహుటిన మృతురాలి స్వగృహం కి వెళ్లి పార్ధివ దేహం నుండి కార్నియా లను సేకరించి హైదరాబాద్ డాక్టర్ అగర్వాల్ నేత్రనిధి కి పంపడం జరిగింది.

ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ మనిషి మరణించినప్పటికీ ఆ మనిషి ఈ లోకాన్ని చూడాలని ఆ కుటుంబ సభ్యులు తలిస్తే, తమ కుటుంబం లోని వ్యక్తి ద్వారా మరో ఇద్దరు అంధులకు చూపు ఇచ్చి వారి చీకటి జీవితంలో వెలుగులు చూపించాలని అనే ఆలోచన నిజం చేసుకోవాలి అంటే కేవలం నేత్రదానం చేస్తే చాలు అని అన్నారు.

కుటుంబం లోని వ్యక్తి లేదా సహచరులు ఎవరైనా మరణించిన వెంటనే 9966509364, 7093204537 ద్వారా సమాచారం ఇస్తే చాలు వెంటనే వెలకట్టలేని, మట్టిపాలు కాకుండా కార్నియా లను సేకరించి అంధుల చూపు కోసం పంపిస్తామని, దీన్ని ప్రతి కుటుంబం ఒక సంప్రదాయంగా భావించి అంధత్వ నివారణకు ప్రతిఒక్కరు తమ వంతు బాధ్యతగా నేత్రదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా నేత్రదానానికి అంగీకరించిన కాంబోజి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బంధువులు, సన్నిహితులు, సేవాసమితి సభ్యులు కాంబోజి కుటుంబ సభ్యులను అభినందించారు.

Related posts

చెరువు కుంటను పరిరక్షించండి: ముంపు బెడద తప్పించండి

Satyam NEWS

అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

శ్రీవారి ఆలయంలో రేపు కైశికద్వాదశి ఆస్థానం వేడుక

Satyam NEWS

Leave a Comment