30.7 C
Hyderabad
April 29, 2024 04: 26 AM
Slider క్రీడలు

కొత్త ఏడాది లో తైక్వాండో పోటీలు: పోస్టర్ ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్

#kolagatla

ఆత్మరక్షణ క్రీడలు దేహ దారుఢ్యానికి, సమయస్ఫూర్తికి  ఎంతగానో ఉపయోగపడతాయని ఏపీ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ మేరకు తన నివాసంలో టైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఏపీ టైక్వాండో అసోసియేషన్ నిర్వహణలో  విజయ నగరానికి చెందిన  విన్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న  కోచ్ ల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్లను తన నివాసంలో విడుదల చేశారు.

ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. నిర్వాహకులు రవి మండ, వి ఆనంద చౌదరి, కోచ్  వినేషులు మాట్లాడుతూ జనవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు విజయనగరంలోని ఎన్సిఎస్ థియేటర్ వెనుక గల ఇన్స్పైర్ స్కూల్ ఆవరణలో ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు రోజులు పాటు జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 300 మంది క్రీడాకారులు పాల్గొనబోతున్నారని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.

Related posts

టిఆర్ఎస్ సభ్యత్వాన్ని ప్రారంభించిన పలుస

Satyam NEWS

24 నుండి స్పర్శదర్శనం

Sub Editor 2

కూలీలకు అడ్డా సౌకర్యం కల్పించాలి: ఏఐటీయూసీ

Satyam NEWS

Leave a Comment