40.2 C
Hyderabad
April 29, 2024 17: 03 PM
Slider హైదరాబాద్

చెరువు కుంటను పరిరక్షించండి: ముంపు బెడద తప్పించండి

#uppalmla

ఉప్పల్‌ నియోజకవర్గంలోని చెరువుల పరిరక్షణ, సుందరీకరణ, అభివృద్ది పనుల అంశాన్ని నేడు ఉప్పల్‌ ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఉప్పల్‌ నియోజకవర్గంలోని కాప్రా చెరువు, చర్లపల్లి చెరువు, నాచారం పెద్ద చెరువు, పటేల్‌కుంట చెరువు, రామంతాపూర్‌ పెద్ద చెరువు, చిన్న చెరువు, ఉప్లన నల్ల చెరువుల సుందరీకరణకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలలో చెరువులకు ఎఫ్‌టీఎల్‌ స్థీరీకరణ జరగలేదని ఆయన అన్నారు. ఒక ప్రణాళిక లేకుండా పైప్‌లైన్లు వేశారని, రోడ్డు నుండి పైప్‌లైన్‌ వేయడం వలన చెరువు పరిసర ప్రాంతాలలోని కాలనీలు నీట మునిగి పోతున్నాయని ఆయన అన్నారు.

గత వర్షాలకు రామంతాపూర్‌ ప్రాంతం అంతా మునిగిపోయిందని దానికి శాశ్వత పరిష్కారం కోసం 10.34 కోట్లు మంజూరు చేశారన్నారు. చెరువులకు ఎఫ్‌టీఎల్‌ ఫిక్స్‌ చేసి రామంతాపూర్‌, నాచారం చెరువులలో కొలనులు ఏర్పాటు చేసినట్లయితే గణేష్‌ నిమజ్జనం, బతుకమ్మ, చాత్‌ పూజు చేయడానికి పరిసర ప్రాంతాల ప్రజలకు  అనువుగా ఉంటుందని తెలిపారు.

చెరువుల అభివృద్ది పురోగతి పనుల్లో వేగం పెంచాలని కోరారు. నాచారం పటేల్‌కుంట చెరువులోకి ఫ్యాక్టరీలు, మదర్‌డైరీ పాల నుంచి వ్యర్ధాలు మురుగు నీటి  ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన సీవరేజ్‌ లైను సామర్ద్యం తక్కువగా ఉండటం వలన అక్కడ నీరు నిలిచి దోమల బెడద వలన స్థానిక ప్రజలు రోగాల బారిన పడుచున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాలన్నింటిని పరిశీలిస్తామని మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు.

Related posts

ట్విట్లర్ లో మారు మోగుతున్న అమిత్ షా రాజీనామా డిమాండ్

Satyam NEWS

నిత్యావసరాలు అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

క‌ళాశాల విద్యార్దుల‌తో విజయనగరం ఎస్పీ దీపిక ముఖాముఖీ

Satyam NEWS

Leave a Comment