38.7 C
Hyderabad
May 7, 2024 18: 29 PM
Slider హైదరాబాద్

ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి

రాష్ట్రంలో ఉన్న ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హోం మంత్రి గురువారం నాడు చౌటుప్పల్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చౌటుప్పల్ పరిధిలోని డి నాగారం, మల్కాపురం, కాట్రేవు తదితర గ్రామాల్లో జరిగిన సమావేశలలో హోం మంత్రి పాల్గొన్నారు.

డి నాగరం గ్రామంలో జరిగిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి తో పాటు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులతో పాల్గొన్నారు. మల్కాపురంలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం సోదరులతో సమావేశం నిర్వహించారు.

అదేవిధంగా యాదవ సోదరులు కాట్రేవు గ్రామంలో హోం మంత్రికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో హోమ్ మంత్రి మాట్లాడుతూ ముస్లిం సోదరుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూళ్లను, ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్లను , షాదీ ముబారక్, ఫీజు రియంబర్స్మెంట్, డబల్ బెడ్ రూమ్ ల కేటాయింపు వంటి పథకాలను ముస్లిం సోదరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలను, కులాలను సమానంగా బావించే లౌకిక నాయకుడని హోంమంత్రి కొనియాడారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని తెలియజేశారు. దేశంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ,అభివృద్ధి బాటన పయనిస్తూ తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఉందన్న విషయం పలువురు ఇతర రాష్ట్రాల నేతలు తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా హోం మంత్రి గుర్తు చేశారు. రైతుల కోసం ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తూ వారికి అండగా నిలిచారన్నారు. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, తదితర వర్గాల వారికి పెన్షన్లను అందజేసి వారి కుటుంబ సభ్యుల్లో సంతోషం నింపారన్నారు.

దళితుల అభివృద్ధి కోసం ఎక్కడా లేని విధంగా దళిత బంధు పేరిట లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల లబ్ధి చేకూరే విధంగా అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని హోంమంత్రి అన్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ప్రగతి బాటన సాగుతున్నందున మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ప్రజలు ఆయనను గెలిపించడం ద్వారా మునుగోడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసినట్లు అవుతుందని హోం మంత్రి తెలిపారు. టిఆర్ఎస్ నాయకులు బద్రుద్దీన్, మునిరుద్దీన్, ఎజాజ్, ఆరిఫ్, షరీఫ్ ఉద్దీన్, అప్రోజ్ తదితరులు కార్యక్రమలలో పాల్గొన్నారు.

Related posts

మార్కాపురం ఎమెల్యే సీటు కోసం “ఉడుముల”

Satyam NEWS

విజయ బేరి సభకు భారీగా తరలాలి

Bhavani

విజ‌యం సాధించిన బీజేపీ కార్పొరేట‌ర్ల‌కు ఘ‌న స‌న్మానం

Sub Editor

Leave a Comment