28.2 C
Hyderabad
May 9, 2024 02: 53 AM
Slider సంపాదకీయం

Fact Finding: ఆ అమ్మాయి పుతిన్ కుమార్తె కాదు

#VladimirPutin

కరోనాకు రష్యా వ్యాక్సీన్ రూపొందించిందని తర్వలో మార్కెట్ లోకి వస్తుందని ఆశపడుతున్న వారికి నిరాశ కలిగించే విషయం ఏమిటంటే వ్యాక్సిన్ సంగతి ఎలా ఉన్నా వైరల్ అయిన వీడియోలో ఉన్న అమ్మాయి మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తె కాదు.

పుతిన్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మారియా, కత్రీనా. ఈ ఇద్దరిలో ఎవరు కరోనా వ్యాక్సీన్ తీసుకున్నారో పుతిన్ కూడా స్పష్టంగా చెప్పలేదు. వ్యాక్సీన్ తీసుకుంటున్న వీడియోలో, ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయితో పోలిస్తే  ఈ ఇద్దరి వయసు చాలా ఎక్కువగానే ఉంటుంది.

తన కుమార్తె వ్యాక్సీన్ తీసుకున్నది అని పుతిన్ చెప్పగానే బయటకు వచ్చిన ఈ వీడియో ఫొటో వైరల్ అయ్యాయి. ఆ అమ్మాయి పుతిన్ కుమార్తా కాదా అనే విషయం కూడా తెలుసుకోకుండా అన్ని సామాజిక మాధ్యమాలలో ఆ ఫొటో వైరల్ అయింది.

మరీ ముఖ్యంగా తెలుగు న్యూస్ ఛానెల్స్ అయితే కనీసం ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చూడకుండా ప్రసారం చేసేశాయి. వీడియోలో వ్యాక్సీన్ తీసుకుంటున్న అమ్మాయి ఒక వాలంటీర్ మాత్రమే. పుతిన్ కుమార్తె కాదు. గత నెలలోనే ఈ వీడియో బయటకు వచ్చింది.

ఇది పూర్తిగా తప్పుడు వీడియో అని స్పష్టంగా చెప్పవచ్చు. పుతిన్ వెల్లడించిన వివరాలు అపరిపక్వమైనవి. ఇంకా రష్యా వ్యాక్సీన్ ట్రయల్స్ దశలోనే ఉందనేది వాస్తవం. రష్యా అభివృద్ధి పరచిన వ్యాక్సీన్ ను పాత రష్యా లోని మిగిలిన దేశాలే ఇంకా గుర్తించలేదు.

ఉక్రేయిన్ ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఈ వ్యాక్సీన్ ను ఇంకా గుర్తించలేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, యునైటెడ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కానీ పుతిన్ చెప్పిన వ్యాక్సీన్ ను ఇప్పటి వరకూ గుర్తించలేదు. ఏ దేశానికి ఆ దేశం ప్రయోగాలు మళ్లీ చేసుకుని రష్యా వ్యాక్సీన్  కరెక్టా కాదా అని సరి చూసుకుని తమ తమ దేశాలకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ విధమైన ప్రయోగాలు చాలా దేశాలు చేయలేరు. రష్యానే మందుల ఉత్పత్తిలో భారత కంపెనీలపై ఆధారపడి ఉంటుంది. రష్యాలో డాక్టర్ రెడ్డీస్ మందులు వ్యాక్సీన్ల అమ్మకాలలో గణనీయమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల రష్యా కరోనా వ్యాక్సీన్ పై పెద్దగా ఆశలు పెట్టుకోవద్దు.

Related posts

నాగార్జున ప్రారంభించిన బిగ్‌బాస్‌ ఈజ్‌ వాచింగ్‌ యు

Satyam NEWS

కరోనా లెసన్స్: ప్రభుత్వ వైద్యో నారాయణో హరి:

Satyam NEWS

జర్నలిస్టుల మహాసభను  జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment