38.2 C
Hyderabad
May 2, 2024 20: 33 PM
Slider ముఖ్యంశాలు

మిస్సింగ్ కేసులపై దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు

#DIGRanganath

మిస్సింగ్ కేసులను చేధించడం లక్ష్యంగా నల్లగొండ జిల్లాలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని డిఐజి ఏ.వి. రంగనాధ్ తెలిపారు.

శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, మిస్సింగ్ కేసులకు సంబంధించిన వ్యక్తుల బంధువులు, కుటుంబ సభ్యులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిస్సింగ్ కేసులపై జిల్లాలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పోలీస్ అధికారులను ఆదేశించారు.

హైకోర్టు ఉత్తర్వులు, డిజిపి ఆదేశాల మేరకు మిస్సింగ్ కేసులు చెందించడం కోసం జిల్లాలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో ఉన్న పెండింగ్ మిస్సింగ్ కేసులను పోలీస్ స్టేషన్ల వారీగా ఆయన సమీక్షించారు.

దీర్ఘకాలంగా చేధించలేని కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు.

18 సంవత్సరాల లోపు వయసు ఉన్న చిన్నారులు, మహిళల మిస్సింగ్ కేసులపై అత్యధిక శ్రద్ద వహించి కేసులను స్థానిక పోలీసులు, ఇతర విభాగాల సమన్వయంతో చేధించేలా కృషి చేయడం జరుగుతుందని డిఐజి వివరించారు. మతిస్థిమితం లేని వ్యక్తులు, చిన్నారులు, మైనర్ బాలికలు, యువతులు, మహిళల మిస్సింగ్ కేసులను విభజన చేసి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి మిస్సింగ్ కేసులను చేధించడం కోసం నిరంతరాయంగా కృషి చేస్తామని చెప్పారు.

నల్లగొండ జిల్లాలో మొత్తం 75 మిస్సింగ్ కేసులున్నాయని, 2019లో ఏడు కేసులు నమోదయ్యాయని, అవి కూడా పురుషుల మిస్సింగ్ కేసులని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 17 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని వివరించారు. మిస్సింగ్ కేసులలో సమగ్ర విచారణ చేయాలని, బంధువులు, చుట్టుపక్కల వారిని సైతం విచారించాలని ఆయన పోలీస్ అధికారులకు సూచించారు.

సమావేశంలో అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, డిఎస్పీ రమణా రెడ్డి, సిఐలు రవీందర్, సత్యం, సదా నాగరాజు, మహబూబ్ బాషా, నిగిడాల సురేష్, ఆదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఐ.లు నర్సింహులు, రాజశేఖర్ రెడ్డి, శ్రీనయ్య, గోపాల్ రావు, ఉపేందర్ రెడ్డి, సతీష్ రెడ్ది, పరమేష్, ఆయా పోలీస్ స్టేషన్ల హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైఎస్ ఆప్తుల జాబితాలో జగన్ ఉన్నట్లా? లేనట్లా?

Satyam NEWS

పేరిణి నృత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు రావాలి

Satyam NEWS

లక్ష్మీ ప్రైడ్ అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగడం అభినందనీయం

Satyam NEWS

Leave a Comment