39.2 C
Hyderabad
May 3, 2024 14: 58 PM
Slider ముఖ్యంశాలు

నోటి దురుసే  దాడికి కారణం

#gayatri

తెలంగాణలో నెలకొన్న ప్రశాంతత, కొనసాగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విచ్ఛిన్నం చేసే కుట్రలు పన్నుతున్నారని టి‌ఆర్‌ఎస్ ఎం‌పి వదిరాజు రవిచంద్ర ఆరోపించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటిపై చోటుచేసుకున్న దాడి విషయంలో కులాల ప్రస్తావన తేవడం, కులాలకు ఆపాదించడం తీవ్ర అభ్యంతరకరమని  మున్నూరుకాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు కూడా ఐన వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఎంపీగా గెలిచిన నాటి నుంచి అర్వింద్ టీఆర్ఎస్ ప్రముఖులపై నోరు పారేసుకోవడం, పోలీసులు, ప్రభుత్వ అధికారులతో తరుచూ గొడవ పడడం అందరికీ తెలిసిందేనన్నారు. అర్వింద్ అతిగా మాట్లాడడం వల్లే ఎమ్మెల్సీ కవిత అభిమానులు ఆయనపై ఇంటిపై దాడి చేసి ఉంటారని  రవిచంద్ర అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా ఉండి, అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగడాన్ని బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆవేదన చెందారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అనిశ్చిత వాతావరణంలో అభివృద్ధి కి దూరంగా ఉండడం,అందుకు భిన్నంగా తెలంగాణలో పచ్చదనం నెలకొనడంతో చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతుండడం శోచనీయం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ మున్నూరుకాపులకు పలు పదవులిచ్ఛి సముచిత గౌరవం ఇవ్వడం జరిగిందని వద్దిరాజు వివరించారు. రాజకీయ గొడవలను కులాలకు ఆపాదించవద్దని ప్రతిపక్ష నాయకులకు రవిచంద్ర హితవు పలికారు. విలేకరుల సమావేశంలో మున్నూరుకాపు ప్రముఖులు పారా నాగేశ్వరరావు, ఆకుల గాంధీ, జాబిశెట్టి శ్రీనివాస్ రావు,  తీగల విజయ్, గుండ్లపల్లి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హృదయ రాణి

Satyam NEWS

మైనర్‌పై అత్యాచారం: 9 రోజుల్లో తీర్పు.. 20 ఏళ్ల శిక్ష

Sub Editor

Demand: రైతులందరికి ఖరీఫ్ పంటకు ఋణాలివ్వాలి

Satyam NEWS

Leave a Comment