38.2 C
Hyderabad
May 3, 2024 20: 39 PM
Slider నల్గొండ

Demand: రైతులందరికి ఖరీఫ్ పంటకు ఋణాలివ్వాలి

#CPM Nakrekal

రైతులందరికీ నాబార్డు స్కేలు ఆప్ ఫైనాన్స్ ప్రకారంగా ఖరీఫ్ పంట రుణాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీ శైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ చిట్యాల మండల కేంద్రంలో యస్. బీ.ఐ .బ్యాంక్ ముందు రైతులు ధర్నా చేశారు.

ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రైతు బందు చెక్కులు ఇచ్చి, రైతులకు ఒకేసారి రుణ మాఫీ చేయాలని కోరారు.  2020 సంవత్సరానికి ఖరీఫ్ సీజన్ లో పంటల వారిగా అందరికీ పంటరుణాలు ఇప్పించాలని అన్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సమబావన సంఘం సభ్యులందరికీ ఒక్కొక్కరికి రూ 5 వేల చొప్పున ప్రభుత్వం బ్యాంక్ ల ద్వారా ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, పామనుగుల్ల అచ్చాలు,ఐతరాజు నర్సింహ, నారబోయ్న శ్రీనివాసులు, శీలా రాజయ్య, అరూరి శీను, వడ్డేపల్లి ఎల్లయ్య, బెలిజ మల్లయ్య, రూపని రాములు, కొసనపు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం యస్. బీ.ఐ.మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు.

Related posts

నార్ముల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయభేరీ

Satyam NEWS

హైదరాబాద్‌లో ప్రారంభమైన అమితాబ్‌ –అజయ్‌ దేవగణ్‌ ‘మే డే’

Satyam NEWS

‘జగన్‌ సలహాలను పరిగణలోకి తీసుకోవాలని అమిత్‌ షాను కోరాం’

Satyam NEWS

Leave a Comment