40.2 C
Hyderabad
May 1, 2024 17: 53 PM
Slider కవి ప్రపంచం

హృదయ రాణి

#K.Haranath New Photo

పచ్చని వనంలో ఒక పువ్వు పూచింది

ఒక పెదవి నవ్వింది

వనమంతా పరిమళమై

సోయగాలు చిమ్మింది

విరబూసుకున్న కురులు

జాజి తీగలై జాలువారినట్లు

ఆ గాజుల గలగలలు

వలపుల తలపులై చెలరేగినట్లు

ఆ చక్కని చుక్క చీర అంచులు

ఇంద్రచాపమై గోచరించినట్లు

ఆ పలువరుసలు పిండివెన్నెల్లా

కలువరేకులైనట్లు

ఆ బుగ్గలు కెంపులై కాంతిపుంజం చిమ్మినట్లు

ఆ చెలియ కనులు చేప కనులై

చెలికాడి మనసు దోచినట్లు

మిలమిల మెరిసే ఆ పసిడి మేను

పాల నురగై మీగడ తరగై

అతి సున్నిత వనితై

నా కవితకు నాంది పలికిన కోమలివై

నవ కవితను నాకందించిన

ఓ…నా సుతిమెత్తని హృదయ దూదిపింజమా

కవి మనసు గెలిచిన కరుణారుణ తరుణీ

ఓ…నా ప్రియ ప్రియురాలా….

కె.హరనాథ్, 9703542598

Related posts

కైండ్ గెశ్చర్: నూతన వధూవరులకు పట్టు వస్త్రాల పంపిణీ

Satyam NEWS

అక్కా, నిను పట్టించుకోని సమాజాన్ని క్షమించు

Satyam NEWS

రెజ్లింగ్ లో స్వర్ణం సాధించిన ప్రియా మాలిక్

Satyam NEWS

1 comment

Amjad. May 28, 2021 at 7:57 PM

HRUDAYA RANI a Good concept kavita. Congrats.

Reply

Leave a Comment