Slider ప్రత్యేకం

తెలంగాణ రాష్ట్రం లో కుటుంబ పాలన సాగుతోంది…!

#goel

తెలంగాణ యువత దేశ వ్యాప్తంగా ఐటీ రంగంలో దూసుకుపోతోందని హైదరాబాద్ లోని హోటల్ సవేరాలో అన్నారు. తెలంగాణలో గత పదేళ్లుగా నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన కొనసాగుతోందని పదేళ్ల కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ అభివృద్ధి పతనమైందన్నారు. బిజెపి శ్రేణులు  ఇంటింటికి వెళ్ళండి.. బీఆర్ఎస్ సర్కారు అవినీతిని… కేసీఆర్, కేటీఆర్, కవిత అవినీతిని ఎండగట్టండని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. నరేంద్ర మోడీ పాలనలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని 2047 వరకు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరం పూర్తిచేసుకుంటుందని అన్నారు. అప్పటికి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ నుండి అభివృద్ధి చెందిన అగ్రశేణి ఆర్థిక వ్యవస్థగా భారత్ పురోగమిస్తుందని విశ్వసిస్తున్నామన్నారు.

ఆదివాసీ దేవతలు సమ్మక్క-సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని తెలంగాణకు ప్రకటించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే తెలంగాణలో పెట్టుబడులు 11 రెట్లు పెరిగాయని అన్నారు. దేశంలో 100 శాతం ఇండ్లకు నల్లానీటిని అందించేలా కృషి చేసింది..కేంద్రంలో మోడీ ప్రభుత్వమని అన్నారు. దేశంలో పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజనతో ఆదుకుంటోంది. రైతులకు మేలు చేసే ఫసల్‌బీమా యోజన పథకాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు.

జన్ ధన్ యోజన ద్వారా బ్యాంకు ఖాతాలు లేని వారికి బ్యాంకు ఖాతాలు తెరిచిందని జన్ ధన్ అకౌంట్లతో దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా `నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు. ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుందన్నారు. పేదలు, రైతులు, వారి కుటుంబం బాగుపడాలంటే ఒక్క బిజెపి తోనే సాధ్యం అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కాని, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని నొక్కి వక్కానించారు. బీఆర్ఎస్ పాలనలో పరీక్ష పేపర్లు లీకవుతున్నాయి. నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.

అవినీతి కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు విశ్వసించరని గట్టిగా చెప్పారు. తెలంగాణ ప్రజలను అవినీతి పార్టీల నుంచి విముక్తి కల్పించాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. నాకు పూర్తి నమ్మకం ఉంది.. బిజెపి శ్రేణులు నూతన ఉత్సహంతో పనిచేస్తారని. ప్రతిక్షణం దేశం కోసమే.. దేశ అభివృద్ధి కోసమో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించేందుకు భారతీయ జనతా పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండని అన్నారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకి మాది బాధ్యత అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

Related posts

వైస్సార్ చేయుత ప్రారంభించిన రాజంపేట ఎమ్మెల్యే

Satyam NEWS

డైరెక్ట్ ఎటాక్ :కరీంనగర్ లో పోలీస్ vs ఎంపీ సంజయ్‌

Satyam NEWS

అసైండ్ భూముల పొందిన వారికి యాజమాన్య హక్కులు

Bhavani

Leave a Comment