38.2 C
Hyderabad
May 2, 2024 19: 35 PM
Slider తెలంగాణ

డైరెక్ట్ ఎటాక్ :కరీంనగర్ లో పోలీస్ vs ఎంపీ సంజయ్‌

karimnagar police vs mp sanjay

కరీంనగర్ పోలీసులతో అమీతుమీకి సిద్దపడుతున్నాడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌. తనకు పోలిసుల రక్షణ అవసరం లేదని తన వ్యక్తిగత భద్రతతోపాటు అదనంగా కల్పించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు డీజీపీకి ఈ మెయిల్‌, ఫ్యాక్స్‌ ద్వారా లేఖ పంపించారు.మరి ప్రజాప్రతినిధి అయినా బండికి రక్షణ లేకపోతె ఎలా అనే ప్రశ్న ప్రజల్లో వెలువడుతుంది.ఎందుకు అయన భద్రతా ఉపసంహరించుకుంటున్నారని విషయంలోకి వెళితే

చాలా రోజులుగా ఎంపీ సంజయ్ కి కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డికి పొసగడం లేదనే బిజెపి వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. విధినిర్వహణలో సామాన్యుల ప్రశంసలు అందుకుంటున్నసిపి మంత్రి గంగుల కమలాకర్ కు టీఆరెఎస్ పార్టీ కి అనుకూలంగావ్యవహరిస్తున్నదని వారి అభియోగం.దీనికి తోడు గతం లో పోలీసులు తనపై దాడిచేశారని,ఇటీవల తనపై రాళ్లదాడి జరిగినప్పటికీ, అటువంటి ఘటన ఏదీ జరగలేదని కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ పత్రికా ప్రకటన ఇచ్చారని బాధతో సంజయ్ ఉన్నట్లుతెలుస్తుంది.

జరిగిన ఘటనపై తనను విచారించకుండానే ఆ ఘటన జరగలేదని సీపీ ప్రకటన ఇవ్వడం అభ్యంతకరమని అయన బాహాటం గానే లేఖలో పేర్కొన్నారు. గతంలో ఇదే విధంగా ఒకటి రెండు ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. దీనిని సీరియస్‌గా తీసుకుని సీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు.తనపై దడి జరిగినప్పుడు చుసిన వ్యక్తిగత సిబ్బంది కూడా దీనిపై మౌనం గా ఉండటాన్ని అయన జీర్ణించుకోలేక పోతున్నారు.

నిరసనగా ఎంపీ తన వ్యక్తిగత గన్‌మెన్‌తోపాటు అదనపు భద్రతను పోలీసు కమిషనరేట్‌కు బుధవారమే తిప్పిపంపినప్పటికీ అధికారులు నిరాకరించినట్లు తెలిసింది. ఎంపీ స్వయంగా లెటర్‌ ఇస్తేనే గన్‌మెన్‌ను ఉపసంహరిస్తామని చెప్పినట్లు తెలిసింది. గురువారం ఉదయం ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఫోన్‌ స్విచాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారని బీజేపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో ఆ వార్త వైరల్‌ అయింది.ఎంపీ బండి సంజయ్‌కుమా ర్‌ ఎలాంటి భద్రత లేకుండానే మరో నాయకుడితో కలి సి ద్విచక్రవాహనంపై కరీంనగర్‌లో తిరిగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టాయి.

గాయపడి న కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ తన గన్‌మెన్‌లందరినీ ఇంటి వద్దనే ఉండమని చెప్పి నగరమంతటా ద్విచక్ర వాహనంపై తిరిగి బీజేపీ అభ్యర్థులతోపాటు కొందరు ముఖ్యులను కలిశారని తానేమి అజ్ఞాతం లోకి వెళ్లలేదని అయన మీడియా కు వివరించారు.

ఒక్క సంజయ్ తో కమలాసన్ రెడ్డి కె కాదు తెలంగాణ లో బిజెపి పార్టీ కి పోలీసులకు వార్ నడుస్తుంది.నిజామాబాద్ లో ఎంపీ అరవింద్ తో అక్కడి పోలీసులకు ,హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు లక్ష్మణ్ కు అసదురుద్దిన్ ఓవేసి కి అనుమతులు ఇచ్చి తమకు ఎందుకు ఇవ్వడం లేదనే హైదరాబాద్ పోలీస్ లతో వివాదాలు నడుస్తున్నాయి.

వీరంతా నేరుగా డీజీపీ కె ఆయా పోలీస్ అధికారులపై పిర్యాదు చేశారు కూడా ,కాగా కరీంనగ ఎం పి సంజయ్ కమీషనర్ కమలాసన్ రెడ్డి ల వివాదాం ఇప్పటికే పార్లిమెంట్ దాకా వెళ్లగా ఎప్పుడు సమసి పోతుందో ఎప్పుడు భద్రతను సంజయ్ తీసుకుంటారో నని అటు కార్య కర్తలు ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Related posts

ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ లో జగన్ పెద్ద కుమార్తెకు సీటు

Satyam NEWS

ధరలకు అనుగుణంగా రైస్ మిల్ కార్మికుల వేతనాలు పెంచాలి

Satyam NEWS

మల్లంపల్లి మండలం ఏర్పాటుపై రాజకీయమా?

Satyam NEWS

Leave a Comment