34.7 C
Hyderabad
May 5, 2024 01: 34 AM
Slider జాతీయం

2020లో భువి నుంచి దివికేగిన ప్ర‌ముఖులు

Famous People

ఇంతవ‌ర‌కూ మాన‌వాళి అనేక సంవ‌త్స‌రాల‌ను చూసింది.. భ‌విష్య‌త్‌లో చూడ‌బోతోంది.. ఆయా సంవ‌త్స‌రాల్లో విషాదాలు, సంతోషాలు, సుఖ‌దుఃఖాల క‌ల‌యిక‌తో ఉండే సంవ‌త్స‌రాల‌నే చెప్పొచ్చు. కానీ 2020 సంవ‌త్స‌రం మాత్రం ప్ర‌తీ ఒక్క‌రికీ ఏదో ఒక విధంగా పూర్తిగా దుఃఖంలోనే ముంచిద‌నేది జ‌గ‌మెరిగిన వాస్త‌వం. ప‌రిశ్ర‌మ‌లు, పేద‌రికం పెర‌గ‌డం, వ్యాపారాలు దివాలా తీయ‌డం, క‌రోనా మ‌హ‌మ్మారి విజ్రంభ‌ణ‌తో చోటు చేసుకున్న ప‌రిణామాలు ఇన్నీ అవి కావు.. వీరు వారు అని కాదు అంద‌రికీ న‌ష్ట‌దాయ‌కంగానే మిగిలింది. ఇలాంటి సంద‌ర్భంగా భ‌విష్య‌త్‌లో రావొద్ద‌ని భ‌గ‌వంతున్ని ప్రార్థిద్ధాం.

2020 సంవ‌త్స‌రం ఓ వైపు క‌రోనాతో అనేక మ‌ర‌ణాలు సంభ‌విస్తే.. ప్ర‌పంచం మొత్తం అత‌లాకుత‌లం అవుతుంటే మ‌రోవైపు భార‌త‌దేశంలో కూడా ఈ వైర‌స్‌తో అనేక మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇందులో క‌రోనాతో ఎంద‌రో ప్ర‌ముఖులు ఆయా రంగాల వారు కూడా ఉన్నారు. కాగా ఈ సంవత్స‌రంలో లెక్క‌ల ప్ర‌కారం 70 మంది ప్ర‌ముఖులు ఆయా కార‌ణాల వ‌ల్ల, క‌రోనా వ‌ల్ల‌, అనారోగ్యాల‌తో మ‌ర‌ణించారు. వారి వివ‌రాలు..

క్రికెట్ సూప‌ర్‌ఫ్యాన్‌గా పేరొందిన చారుల‌తా ప‌టేల్ 13 జ‌న‌వ‌రిన లోకాన్ని విడిచి వెళ్ళారు.

ఢిల్లీకి చెందిన ప్ర‌ముఖ టీవీ న‌టి సెజ‌ల్ శ‌ర్మ 24 జ‌న‌వ‌రి‌న ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

భార‌తీయ హాకీటీమ్ దిగ్గ‌జం, ఓలంపిక్ బ్రాంజ్ మెడ‌ల్ సాధించిన బ‌ల్వీర్ సింగ్ కుల్ల‌ర్ 28 ఫిబ్ర‌వ‌రిన (77) క‌న్నుమూశారు.

బాలీవుడ్ దిగ్గ‌జ తార నిమ్మి ముంబైలో 25 మార్చి 87ఏళ్ల వ‌య‌స్సులో మ‌ర‌ణించారు.

త‌మిళ క‌ళాకారుడు డాక్ట‌ర్ సేతురామ్ 26 మార్చిన (34) గుండెపోటుతో మ‌ర‌ణించారు.

మ‌ల‌యాళం సంగీత‌కారుడు ఎంకె. అర్జున‌న్ (84) 6 ఏప్రిల్‌న మ‌ర‌ణించారు.

హిందీ సినీ నిర్మాత దీపా గంగూలీ (75) 23 ఏప్రిల్‌న గుండెపోటుతో మ‌ర‌ణించారు.

29 ఏప్రిల్‌న 53 ఏళ్ల వ‌య‌స్సులో బాలీవుడ్ యాక్ట‌ర్ ఇర్ఫాన్‌ఖాన్ కెన్స‌ర్‌తో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు.

30 ఏప్రిల్‌న బాలీవుడ్ మ‌రో దిగ్గ‌జ న‌టుడు అప్ప‌టి న‌టుల్లో సొగ్గాడు రిషిక‌పూర్ (67) కెన్స‌ర్ కార‌ణంగా అనారోగ్యంతో మ‌ర‌ణించారు.
స‌ల్మాన్‌ఖాన్ సినిమా రెడీలో న‌టించిన మోహిత్ భ‌గేలా (26) 24 మేన కెన్స‌ర్‌తో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

టీవీ షోల్లో న‌టించిన ప్ర‌ముఖ న‌టి ప్రేక్షా మోహ‌తా 25మేన ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డి మ‌ర‌ణించింది.

రాజ‌కీయాల‌లో త‌న‌దైన ప్రాముఖ్య‌త క‌లిగి ఉన్న చ‌త్తీస్‌ఘ‌డ్ మొద‌టి ముఖ్య‌మంత్రి అజిత్ జోగి (74) 29 మేన గుండెపోటుతో మ‌ర‌ణించారు.

ప్ర‌ముఖ జ్యోతిష్యుడుగా పేరొందిన బెజాన్ దారువాలా 29 మేన (88) కోవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించారు.

సినీ గాయ‌కుడు యోగేష్ గైడ్ 29 మేన తుది శ్వాస విడిచారు.

సాజిద్‌-వాజిద్‌ల జోడీని బాలీవుడ్ ప్ర‌ముఖుల్లో ఒక‌రుగా వీరి జోడిని చెప్పుకుంటారు.. వాజిద్‌ఖాన్ 1 జూన్‌న (42) తుది శ్వాస విడిచారు.

బాలీవుడ్ సినీ ప్రొడ్యూస‌ర్ అనిల్ సూరి 4 జూన్‌న క‌రోనాతో మ‌ర‌ణించారు.

బాలీవుడ్ ప్ర‌ముఖ సినీ నిర్మాత‌, సినిమా రైట‌ర్ బ‌సు ఛ‌ట‌ర్జీ 4 జూన్‌న (93) తుది శ్వాస విడిచారు.

క‌న్న‌డ క‌ళాకారుడు చిరంజీవి స‌ర్జా (39) 7 జూన్‌న బెంగుళూరులో గుండెపోటుతో మ‌ర‌ణించారు.

డీఎంకే పార్టీ నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన జ‌య‌రామ్ అన్భుజ‌న్ (62) 10 జూన్‌న మ‌ర‌ణించారు. ఈయ‌న ఒక సినిమాను కూడా రూపొందించ‌డం విశేషం.

సీరియ‌ల్ న‌టుడు జోగేష్ ముకాతి (47) 12 జూన్‌న మ‌ర‌ణించారు.

బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈయ‌న మ‌ర‌ణంపై ఇంకా సందిగ్ధ‌త కొన‌సాగుతోంది. హ‌త్యా, లేక ఆత్మ‌హ‌త్య అనే దిశ‌గా ఇప్ప‌టికీ కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది.

డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ స‌మీర్ భంగ‌డా రోడ్డు ప్ర‌మాదంలో 14 జూన్‌న మ‌ర‌ణించారు.

ప్ర‌ముఖ బాలీవుడ్ కోరియోగ్రాఫ‌ర్ స‌రోజ్‌ఖాన్ (71) 3 జూలై గుండెపోటుతో మ‌ర‌ణించారు. రెండువేల పాట‌ల‌కు గానూ ఈమె కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేయ‌డం విశేషం.

కెన్స‌ర్‌తో చాలాకాలం పోరాడి సినిమా నిర్మాత హ‌రీష్ షా (76) 7 జూలైన తుది శ్వాస విడిచారు.

క‌న్న‌డ టీవీ న‌టుడు సుశీల్ గైడ్ 7 జూలైన ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఆర్థిక ఇబ్బందుల‌తో ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం.

బాలీవుడ్ న‌టుడు జ‌గ‌దీప్ (81) జూలై 8న‌తుదిశ్వాస విడిచారు.

బాలీవుడ్ నిర్మాత ర‌జ‌త్ ముఖ‌ర్జీ జూలై 19న కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతూ జైపూర్‌లో తుదిశ్వాస విడిచారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌కీయ నేత లాల్జీ టాండ‌న్ 21 జూలై (85)లివ‌ర్ ఇన్ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతూ చ‌నిపోయారు.

దిగ్గ‌జ సినీన‌టి కుమ్‌కుమ్ (86) 28 జూలైన తుది శ్వాస విడిచారు. క‌బీ ఆర్ క‌బీ పార్ అనే ఆమె పాట చాలా ఫేమ‌స్‌.

స్టార్‌ప్ల‌స్‌లో వ‌చ్చే సీరియ‌ల్ న‌టుడు స‌మీర్ వ‌ర్మ 6 ఆగ‌స్టున ఆత్మ‌హ‌త్య చేసుకొని చ‌నిపోయారు.

భోజ్‌పురి క‌ళాకారుడు అనుప‌మ్ పాఠ‌క్ 7 ఆగ‌స్టున ముంబైలోని త‌న నివాసంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ఏయిర్ ఇండియా పాయిలెట్ కెప్టెన్ దీప‌క్ సాతే (59) కోజికోడ్‌లో ఆగ‌స్టు 7న జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.

క‌విత రారాజుగా పిలువ‌బ‌డే, గాయ‌కుడుగా సుప‌రిచితుడైన రాహ‌త్ ఇందౌరీ 11 ఆగ‌స్టున గుండెపోటుతో చ‌నిపోయారు.

త‌మిళ గాయ‌కుడు పీకె. ముత్తుస్వామి 11 ఆగ‌స్టున మ‌ర‌ణించారు.

భార‌తీయ క్రికెట్ మాజీ ఆట‌గాడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కెబినెట్ మంత్రి చేత‌న్ చౌహాన్ 16 ఆగ‌స్టున (73) కోవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించారు.

ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డు గ్ర‌హీత పండిత్ జ‌స్‌రాజ్ (90) 17 ఆగ‌స్టున అమెరికాలోని న్యూజెర్సీలో మ‌ర‌ణించారు. ఈయ‌న త‌న జీవితంలోని 80ఏళ్ల‌ను సంగీతం కోస‌మే ధార‌పోశారు.

లివ‌ర్ వ్యాధితో చాలాకాలంగా బాధ‌ప‌డుతూ నిర్మాత నిశికాంత్ కామ‌త్ (50) 17 ఆగ‌స్టున మ‌ర‌ణించారు.

దిగ్గ‌జ సినీ నిర్మాత ఏబీరాజ్ (95) 23 ఆగ‌స్టున గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

అస్సామీ గాయ‌నీ అర్చ‌నా మ‌హంత్ (72) 27 ఆగ‌స్టున గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఈమెకు జూలైలోనే ఒక‌సారి గుండెపోటు వ‌చ్చింది.

భార‌త‌దేశ చ‌రిత్ర‌లో అత్యంత ముఖ్యులైన మాజీ భార‌త రాష్ర్ట‌ప‌తి ప‌ద‌విని అలంక‌రించిన‌, రాజ‌కీయాల‌లో ఓ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా గుర్తింపు పొందిన, దాదా అని ముద్దుగా పిల‌బ‌డే ప్ర‌ణబ్ ముఖ‌ర్జీ (84) 31 ఆగ‌స్టున తుదిశ్వాస విడిచారు. మెద‌డు స‌ర్జ‌రీకి ఆసుప‌త్రిలో చేరిన ప్ర‌ణ‌బ్‌కు అనంత‌రం క‌రోనా కూడా సోకి ఆరోగ్య ప‌రిస్థితులు విష‌మించి చ‌నిపోయారు.

ప్ర‌ముఖ సంగీత‌కారుడు ఎస్‌.మోహింద‌ర్ (94) 6 సెప్టెంబ‌ర్‌న తుదిశ్వాస విడిచారు.

ప్ర‌ముఖ తెలుగు న‌టుడు జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి (74) 8 సెప్టెంబ‌ర్‌న మ‌ర‌ణించారు. ఈయ‌న యాస‌,భాష డైలాగ్‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లో విశేష స్థానాన్నిసంపాదించుకున్నారు.

తెలుగు టీవీ క‌ళాక‌రాణి శ్రీ‌వాణి కొండ‌వ‌ల్లి 8 సెప్టెంబ‌ర్‌న హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో చ‌నిపోయారు.

త‌మిళ సినిమా అభినేత వ‌డివేల్ బాలాజీ (42) 10 సెప్టెంబ‌ర్‌న గుండెపోటుతో మ‌ర‌ణించారు.

ఒరిస్సా సినీ న‌టుడు అజిత్‌దాస్ 13 సెప్టెంబ‌ర్‌న కోవిడ్ కార‌ణంగా మ‌ర‌ణించారు.

త‌మిళ న‌టుడు ఫ్లోరెంట్ సి. ప‌రేరా (67) 14 డిసెంబ‌ర్ మ‌ర‌ణించారు.

మ‌ళ‌యాళం క‌ళాకారుడు, న‌టుడు చ‌క్లాక్క‌ల్ (44) 14 సెప్టెంబ‌ర్‌న చెన్నై జ‌రుగుతున్న షూటింగ్ సెట్‌లోనే హ‌ఠాత్తుగా కుప్ప‌కూలి మ‌ర‌ణించారు.

బాలీవుడ్ సినీ దిగ్గ‌జం అశ‌ల‌త వాబాగాంవ్‌క‌ర్ (79) 22 సెప్టెంబ‌ర్‌న స‌తారాలో మ‌ర‌ణించారు.

ధియేట‌ర్ క‌ళాకారుడు, న‌టుడు భూపేష్ కుమార్ పాండ్యా కెన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ 23 సెప్టెంబ‌ర్‌న మ‌ర‌ణించారు.

క‌న్న‌డ సినిమా న‌టుడు రాక్‌లైన్ సుధాక‌ర్ 24 సెప్టెంబ‌ర్‌న గుండెపోటుతో మ‌ర‌ణించారు.

మాజీ రైల్వే మంత్రి సురేష్ అంగ‌డీ (65) కోవిడ్ కార‌ణంగా ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతూ 23 సెప్టెంబ‌ర్‌న తుదిశ్వాస విడిచారు.

ఇక తెలుగు పాట‌ల్లోనే గాకుండా హిందీలోనూ తియ్య‌ద‌నాన్ని, స్వ‌రం అంటే స్వ‌ర్ణ‌మే అనే ఆకారాల్నిఅల‌వోక‌గా ప‌లుక‌రిస్తూ ఎన్నోఅవార్డుల‌ను సొంతం చేసుకున్న గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం (75) 25 సెప్టెంబ‌ర్ ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. కాగా ఈయ‌న‌లో కూడా క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. 40వేల పాట‌ల‌కు పైగా పాడి గిన్నిస్ వ‌రల్డ్ రికార్డులో కూడా బాల‌సుబ్ర‌మ‌ణ్యం అరుదైన రికార్డును సొంతం చేసుకోవ‌డం విశేషం.

మాజీ కేంద్ర‌మంత్రి, బీజేపీ నేత జ‌శ్వంత్ సిన్హా (82) 27 సెప్టెంబ‌ర్ గుండెపోటుతో మ‌ర‌ణించారు.

గాయ‌కుడు అభిలాష్ (75) 28 సెప్టెంబ‌ర్‌న క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతూ చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు.

కేంద్ర‌మంత్రి, లోక్‌జ‌న‌శ‌క్తి అధినేత రాంవిలాస్ పాశ్వాన్ (74) 8 అక్టోబ‌ర్‌న మ‌ర‌ణించారు. దిగ్గ‌జ రాజ‌కీయ నేత‌గా ఈయ‌న‌కు మంచి పేరుంది.

మొట్ట‌మొద‌టి ఆస్కార్ విజేత (కాస్ట్యూమ్ డిజైనింగ్‌)లో భాను అథియా (91) 15 అక్టోబ‌ర్‌న తుదిశ్వాస విడిచారు.

గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి కేశుభాయ్ ప‌టేల్ (92) 29 అక్టోబ‌ర్‌న గుండెపోటుతో మ‌ర‌ణించారు.

ప్ర‌ముఖ వ‌యోలిన్ విధ్వాంసుడు, ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు గ్ర‌హీత టీఎన్‌.క్ర‌ష్ణ‌న్ (92) 2 న‌వంబ‌ర్‌న చ‌నిపోయారు.
12 న‌వంబ‌ర్‌న ఆసిఫ్ బ‌స్రా బాలీవుడ్ యాక్ట‌ర్ చ‌నిపోయారు.

బెంగాలీ క‌ళాకారుడు సౌమిత్రి ఛ‌ట‌ర్జీ (85) 15 న‌వంబ‌ర్‌న మ‌ర‌ణించారు.

అస్సాం మాజీ ముఖ్య‌మంత్రి త‌రుణ్ గోగోయ్ (86) క‌రోనాతో విముక్తులైనా, పిమ్మ‌ట అనారోగ్యంతో మ‌ర‌ణించారు.

కాంగ్రెస్ పార్టీ దిగ్గ‌జ నేత, రాజ్య‌స‌భ స‌భ్యుడు అహ్మ‌ద్ ప‌టేల్ 25 న‌వంబ‌ర్‌న మ‌ర‌ణించారు. ఈయ‌న‌లోనూ క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లుగా చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

భార‌తీయ ఐటీ విభాగం ప్ర‌ముఖుడు కాఫీర్ చంద్ కోహ్లీ (96) 26 న‌వంబ‌ర్‌న మ‌ర‌ణించారు.

Related posts

కరోనా వైరస్ సోకగానే చనిపోతారనేది కరెక్టు కాదు

Satyam NEWS

అనపర్తి అరాచకంతో జగన్ ప్రభుత్వానికి చరమగీతం

Satyam NEWS

రాజంపేట లో ఆ రెండు సామాజిక వర్గాల దే ఆధిపత్యం.!

Satyam NEWS

Leave a Comment