27.7 C
Hyderabad
April 30, 2024 07: 31 AM
Slider తెలంగాణ

కరోనా వైరస్ సోకగానే చనిపోతారనేది కరెక్టు కాదు

carona virus

కరోనా వైరస్ సోకినంత మాత్రాన చనిపోతారు అన్న ప్రచారం లో  ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి వర్గ ఉప సంఘం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నది వారు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ గుర్తించిన నేపథ్యంలో మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  వైద్య, ఆరోగ్య శాఖ తోపాటు వివిధ శాఖలకు అధిపతులు, ఉన్నతాధికారులు హజరయ్యారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్ లైన్  ఏర్పాటు చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు.

24 గంటల పాటు నడిచే కాల్ సెంటర్ ఏర్పాటు తో పాటు  ప్రస్తుతం ఉన్న కాల్ సెంటర్ సామర్థ్యాన్ని మరింత గా పెంచాలని వారు ఆదేశించారు. గతంలో వచ్చిన ఇతర వైరస్ ల తో పోల్చితే కరోనా వైరస్ లో మరణాల రేటు అతి తక్కువగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కాబట్టి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో కరోనా మెడికేషన్  కు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం గా ఉన్నాయని మంత్రి తెలిపారు. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరస్ కి సంబంధించి ప్రజలను చైతన్యం చేసే  పాజిటివ్ ప్రచారం నిర్వహించాలని ఆయన కోరారు. కరోనా వైరస్ పైన అసత్యాలను ప్రచారం చేసే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు ఈ సందర్భంగా చెప్పారు.

Related posts

లాక్ డౌన్ పేరుతో జర్నలిస్టులను కట్టడి చేయవద్దు

Satyam NEWS

466 అంబులెన్సులు ప్రారంభం

Bhavani

హుజురాబాద్ లో జాగింగ్ ట్రాక్ కు స్థలం సిద్ధం

Satyam NEWS

Leave a Comment