29.7 C
Hyderabad
May 1, 2024 09: 58 AM
Slider కడప

రాజంపేట లో ఆ రెండు సామాజిక వర్గాల దే ఆధిపత్యం.!

#bhatyala

ఫ్యాక్షన్ సంస్కృతికి పూర్తి భిన్నంగా ప్రశాంతతకు ఆలంబనగా (నిలుస్తూ వస్తున్న నియోజకవర్గం రాజంపేట. ఇక్కడ హత్యలు, ప్రతిహత్యలు, విమర్శలు, ప్రతి విమర్శల శాతం చాలా తక్కువ కులాలు, వర్గాలకే ఇక్కడి ప్రజలు పార్టీల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. దీనిని అనుసరించే ప్రధానపక్షాలు కూడా కులా లు ఆధారంగా అభ్యర్తుల ఎంపిక జరుపుతూ వస్తున్నారు. ఉప ఎన్ని కలతో కలుపుకుంటే రాజంపేట అసెంబ్లీకి 18వ మారు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు 17 మార్లు రాజంపేట శాసనసభకు ఎన్నికలు జరిగాయి.

1952, 1955 లలో ద్విసభ్య నియోజకవ ర్గంగా రాజంపేట ఉంది. 1955 నుండి ఇప్పటివరకు 2009లో మినహాయించి ఈ నియోజకవర్గంలో బలిజ వర్సెస్ రెడ్డి సామాజిక వర్గాల మధ్యే పోరు జరుగుతూ వస్తుంది. ఇప్పటివరకు 17 మార్లు. ఎన్నికలు జరుగగా రెడ్డి సామాజిక వర్గం నుండి 11 మార్లు, బలి! సామాజిక వర్గం నుండి 6 మార్లు అభ్యర్థులు ఎన్నికవ్వడం జరిగిం ది. మొత్తంగా తీసుకుంటే ఈ రెండు సామాజిక వర్గాలే ఈ నియోజ కవర్గాన్ని శాసిస్తూ వస్తున్నాయి, రానున్న ఎన్నికల్లో కూడా ఇతర సామాజిక వర్గాలు పోటీ పడుతున్నా ఈ రెండు సామాజిక వర్గాల మధ్యే పోరు తప్పేలా లేదు. మొట్టమొదటి సారిగా 1952లో రెడ్డి సామాజిక వర్గం నుండి పంజం నరశింహారెడ్డి, 1955లో బలిజ సామాజిక వర్గం నుండి పోతురాజు పార్థసారధిలు రాజంపేట ద్విన భ్య నియోజకవర్గంగా ఉండిన రాజంపేట నుండి శాసనసభకు ఎన్ని కయ్యారు. అప్పటి నుండి మొదలైన బలిజ వర్సెస్ రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది.

ముఖ్యంగా కొండూరు మారారెడ్డి, బండారు రత్నసభాపతి కుటుంబాలదే దశా బాల పాటు హవా కొనసాగింది. కొండూరు, బండారు కుటుంబాలే ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో అత్యధికమార్లు విజయం సాధించిన కుటుంబాలుగా చెప్పవచ్చు. ఈ రెండు వర్గాల మధ్య పో రు రసవత్తరంగా సాగిందని చెప్పవచ్చు. అయితే ఓడలు బళ్లు అవు తాయి, బళ్లు ఓడలు అవుతాయన్న సామెత రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. నియోజకవర్గాలను నేతలు జాడే నేడు కనిపించని పరిస్థితులు రాజంపేట రాజకీయాల్లో

మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, బత్యాల చంగల్రాయులు

సర్వసాధారణంగా మారుతూ వస్తుంది. అయితే నేతలు మారు తున్నా బలిజ వర్సెస్ రెడ్డి సామాజిక వర్గాల మధ్య పోరు మాత్రం మారడం లేదు. 2009లో డీ లిమిటేషన్ ప్రక్రియతో అప్పటివరకు రాజంపేట నియోజకవర్గంలో ఉండిన పెనగలూరు మండలం రైల్వే కోడూరు నియోజకవర్గంలోకి వెళ్ళిది. దీంతో ఈ మండలానికి చెంది న కొండూరు కుటుంబం హవా రాజంపేట నియోజకవర్గం నుండి రైల్వేకోడూరు నియోజకవర్గానికి వెళ్ళిపోయింది.

1995 ఎన్నికల్లో చివరిసారిగా శాసనసభకు ఎన్నికైన బండారు రత్నసభాపతి మృతిలో ఆ కుటుంబం హవా కూడా రాజంపేట రాజకీయాల్లో కనుమరుగైం ది. కొండూరు కుటుంబం నుండి కొండూరు మారారెడ్డి ఒక మారు, కొండూరు ప్రభావతమ్మ 4మార్లు, బండారు కుటుంబం నుండి బండారు రత్నసభాపతి మూడు మార్లు రాజంపేట శాసనసభకు ఎన్నికయ్యారు. డీ లిమిటేషన్ ప్రక్రియకు ముందు రాజంపేట నియోజవర్గంలో రాజంపేట మండలంతో పాటు నందలూరు, పెనగ లూరు, ఒంటిమిట్ట మండలాలతో పాటు, గోపవరం మండలంలోని కొంతభాగం రాజంపేట నియోజకవర్గంలో ఉండేది.

ప్రస్తుతం డీ లిమిటేషన్ ప్రక్రియ తరువాత 30 శాతం ఓట్లు పెరిగి ఈ నియోజకవర్గంలో రాజంపేట, నందలూరు, ఒంటిమిట్ట, సిద్ధవటం, వీరబల్లి, సుండుపల్లి మండలాలు చేరాయి. ఈ నియోజకవర్గ చరిత్ర తీసుకుంటే 1952లో కమ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున వంజం నరశింహారెడ్డి(రెడ్డి) 1955లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోతురాజు పార్థసారధి(బలిజ), 1962లో స్వతంత్ర పార్టీ తరపున కొండూరు మారారెడ్డి (రెడ్డి), 1962లో ఇండిపెండెంట్ బండారు రత్నసభాపతి(బలిజ). 1972లో స్వతంత్ర పార్టీ తరపున తిరిగి బండారు రత్నసభాపతి (బలిజ), 1974లో జై ఆంధ్ర ఉద్యమం కోసం శాసనసభ్యత్వానికి బండారు రత్నసభాపతి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియన్ నేషనల్: కాంగ్రెస్ పార్టీ తరఫున కొండూరు ప్రభావతమ్మ (రెడ్డి) 1978. 1983లలో వరుసగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున కొండూరు ప్రభావతమ్మ శాసనసభకు ఎన్నికయ్యారు.

1985లో తెలుగుదేశం పార్టీ తరపున బండారు రత్నసభాపతి (బలిజ), 1989లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున కశిరెడ్డి మదన్మోహన్ రెడ్డి (రెడ్డి), 1994, 1999లతో వరుసగా తెలుగుదేశం పార్టీ తరఫున పసుపులేటి బ్రహ్మయ్య(బలిal), 2004లో తిరిగి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున కొండూరు ప్రభావతమ్మ (రెడ్డి). 2009, 2012లలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆకేపాటి అమర్ నాథరెడ్డి (రెడ్డి), 2014లో తెలుగుదేశం పార్టీ తరపున మేడా వెంకట మల్లికార్జునరెడ్డి (రెడ్డి), 2019లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేడా వెంకట మల్లికార్జునరెడ్డి(రెడ్డి) ఎన్నికవ్వడం జరిగింది.

2009 ఎన్నికలు. మినహాయించి ఈ శాసనసభ స్థానంలో రెడ్డి వర్సెస్ బలిజ సామాజిక వర్గాల మధ్యే పోరు సాగుతూ ఏదో ఒక వర్గం అభ్యర్థి విజయం సాధిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గం శాసనస భ్యులుగా రెడ్డి సామాజిక వర్గం నుండి మేడా వెంకట మల్లి కార్డు నరెడ్డి ఉండగా, విపక్ష తెలుగుదేశం పార్టీ తరపున బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఐత్యాల చంగల్రాయులున్నారు. 2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీ పడడం జరిగింది. తిరిగి వీరిద్దరు రానున్న ఎన్నికల్లో పోటీ పడేందుకు సిద్ధపడుతున్నారు.

కాగా ప్రస్తుతం బత్యాల చంగల్రాయులుకు అభ్యర్థిత్వం విషయంలో ఈ మారు ఇతర వర్గాల నుండి పోటీ వాతావరణం నెలకొని ఉంది. కారణాలు ఏమైనా బత్యాల చంగల్రాయులుకు నియోజకవర్గంలో రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉండే ప్లస్లు, మైనస్లున్నాయి. మైనస్లను అధిగమించిన వారే రాజకీయాల్లో రాణిస్తారనడంలో సందేహం లేదు. ఈ నేపధ్యంలో మైనస్లలను బత్యాల చంగల్రాయు లు రానున్న రోజుల్లో ఏ విధంగా అధిగమిస్తారన్న దానిపై ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

Related posts

ములుగుకు ఈ నెల 28న రానున్న మంత్రి హరీశ్ రావు

Satyam NEWS

NPDCL సిఎండికి అనురాగ్ సొసైటీ అభినందన

Satyam NEWS

గంజాయి సాగుపై ఏపీ డీజీపీ ఆసక్తి కర వ్యాఖ్యలు…!

Satyam NEWS

Leave a Comment