42.2 C
Hyderabad
May 3, 2024 16: 36 PM
Slider గుంటూరు

పల్నాడు ప్రాంత రైల్వే సమస్యల పరిష్కరించాలి

#krishnadevarayalu

పల్నాడు ప్రాంతంలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కోరారు. ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.

ముఖ్యంగా సికింద్రాబాద్‌ నుండి తిరుపతి వరకు ఈ మధ్య ప్రారంభించిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను పల్నాడులో ఎంతో ముఖ్యమైన పిడుగురాళ్ల స్టేషన్‌లో కానీ, నడికుడి స్టేషన్‌లో కానీ ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఈ రెండు స్టేషన్‌ల నుండి ప్రయాణీకులు, వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో ప్రయాణం చేస్తుంటారని, ఈ రైల్‌ వల్ల పల్నాడు జిల్లాలో పర్యాటక, వ్యాపార ప్రయాణాలను ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తుందని మంత్రికి తెలిపారు.

కోవిడ్‌ సమయంలో కొన్ని రైల్లు నిలుపుదల తీసేసారని, దీని వల్ల పెద్ద ఎత్తున ప్రజలు అసౌకర్యానికి గురవతున్నారని వాటిని పునరుద్దరించాలని కోరారు. అవి: రైలు నెం. 12733- నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, రైలు నెం. 17255 – లింగంపల్లి ఎక్స్‌ప్రెస్, రైలు నెం. 12603 – హైదరాబాద్ SF ఎక్స్‌ప్రెస్, రైలు నెం. 17626 – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నెం. 17015 విశాఖ ఎక్స్‌ప్రెస్ ఈ రైళ్లును గతం లాగా పిడుగురాళ్ల, నడికుడి స్టేషన్‌లో ఆగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణీకుల సౌలభ్యం కోసం సికింద్రాబాద్‌ మరియు గుంటూరు మధ్య రెండవ ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనలపై కేంద్ర  మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

వాలంటీర్ల వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం అంతం

Satyam NEWS

మాస్క్ లు లేక‌పోతే…ఇక అంతే…పోలీసుల మాట కాస్త ఆల‌కించండి!

Satyam NEWS

పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఆహార పదార్ధాలు

Satyam NEWS

Leave a Comment