23.7 C
Hyderabad
May 8, 2024 04: 28 AM
Slider ప్రత్యేకం

కరెంటు కోతలతో అల్లాడుతున్న రైతులు

#seetakka

ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో నీరు లేక మోడువారితే ఆ రైతన్నల మనోవేదన వర్ణనాతీతంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఈ రోజు ములుగు మండలం రామచంద్ర పూర్ గ్రామములో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీతక్క మాట్లాడుతూ విద్యుత్ కోతలతో రైతులకు గుండెకోత మిగులుతుందని అన్నారు.

చేతికి వచ్చిన పంట ఎండి పోతుంది.. రైతులకు 24 గంటల కరెంట్ ఏమైంది కెసిఆర్ గారు అని ఆమె ప్రశ్నించారు. కిసాన్ కాంగ్రెస్ సబ్ స్టేషన్ ఎదుట చేపట్టే ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలని సీతక్క పిలుపునిచ్చారు. తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో చేసే పనుల కంటే కేసీఆర్ చెప్పే గొప్పలే ఎక్కువగా ఉంటాయని..ఈ కరెంట్ కోతలు, 24 గంటల విద్యుత్ విషయంలో మరోసారి రుజువైందని అన్నారు. ప్రజలపై కరెంట్ ఛార్జీల రూపంలో రూ. 16 వేల కోట్ల భారం వేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.

పంటలు పండే సమయంలో కరెంట్ కట్ చేస్తున్నారని సీతక్క విమర్శించారు. నాణ్యమైన కరెంట్ అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, కిసాన్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కరి వేద రాజీ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వాకిటి రామకృష్ణ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు మూల రవీందర్,సాధం సాంబయ్య, కరివేద రాజిరెడ్డి, హాట్కర్ స్వామి, పోరిక ప్రమీల, వేములపల్లి స్వామి, గుగులోత్ కరణ్ సింగ్,కాసుల వెంకటేశ్వర్లు, గూడూరు లలిత వీరారెడ్డి,రాయికంటి కుమారస్వామి, అజ్మీరా మోహన్, బేతి రాజిరెడ్డి, కండికొండ శ్రవణ్, గొర్రె సుధాకర్, కోరుకొప్పుల గోపాలస్వామి, అజ్మీరా జగ్గు, బొద్ధుల మార్కండేయ,రుద్రారపు ప్రభాకర్, వెంకటేశ్వర్లు, గవస్కర్, సాధం వెంకన్న, భూక్యా విలేందర్, నంద రవి,క్రాంతి,తుమ్మ జయరెడ్డి కత్రోజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిమ్ కార్డు అమ్మకందారులకు కేంద్ర హెచ్చరిక

Satyam NEWS

మంత్రి గంగులకు, సీఎం కేసీఆర్ కు ఈటల హెచ్చరికలు

Satyam NEWS

ప్రతి పేదవానికి స్వంత ఇంటి కల నెరవేరుస్తాం

Bhavani

Leave a Comment