34.7 C
Hyderabad
May 5, 2024 01: 55 AM
Slider ముఖ్యంశాలు

రైతులను మోసం చేస్తున్న మోడీ ప్రభుత్వం

#farmersprotest

నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న వంచనపై దేశ వ్యాప్తంగా విద్రోహ దినం పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు జిల్లా నరసరావుపేట మునిసిపల్ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగించి నిరసన ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పశ్చిమ గుంటూరు జిల్లా కౌలు రైతు అధ్యక్షులు కామినేని రామారావు, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యస్ కె. జిలానిమాలిక్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.శివకుమారి, సీపీఐ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు, సీఐటీయూ మండల కార్యదర్శి షేక్ శిలార్ మసూద్, ఎల్.ఐ.సి యూనియన్ నాయకులు సయ్యద్ రబ్బానీ, నరసరావుపేట ఏరియా సీపీఐ కార్యదర్శి ఉప్పలపాడు రంగయ్య, సంపత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొమ్మల నాగేశ్వరరావు, మేడం ఆంజనేయులు, బండారుపల్లి నాగేశ్వరావు, బత్తుల బాలకోటయ్య ,సీపీఐ,సీపీఎం,తెలుగుదేశం,జేఏసీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వమన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ డిసెంబర్ 26 వ తేదీ నాగపూర్ లో మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులను మళ్లీ తీసుకొస్తామని చెప్పకనే ప్రభుత్వ రహస్యాన్ని చెప్పారు.

ఇది పెద్ద మోసం. దేశానికి ప్రమాదకరం. ఇవన్నీ చూసిన సంయుక్త కిసాన్ మోర్చా ప్రభుత్వం వంచనకు పాల్పడిందని  ఇచ్చిన హామీల సాధనకు దేశ వ్యాప్తంగా నిరసన చేయాలని ప్రభుత్వ ద్రోహాన్ని నిరసించాలని పిలుపునిచ్చిందని అన్నారు అందులో భాగంగా దేశం మొత్తంతో పాటు నరసరావుపేట లో రైతుల కార్మిక ప్రదర్శన జరిగిందన్నారు. నిరసన ప్రదర్శన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ ఎస్.ఐ. వావిలాల సుబ్బారావు తదితర పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Related posts

దళితులపై దాడులకు తెగబడుతున్న ఎంఐఎం గుండాలు

Satyam NEWS

థియేటర్ వర్కర్స్ ను ఆదుకున్న నందమూరి ఫ్యాన్స్

Satyam NEWS

కొత్తపేటలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

Satyam NEWS

Leave a Comment