26.7 C
Hyderabad
May 3, 2024 09: 30 AM
Slider వరంగల్

మేడారం జాతర కోసం పకడ్బందిగా పార్కింగ్ ఏర్పాట్లు

#medaramjatara

మేడారం జాతర ను పక్కా ప్రణాళికతో నిర్వహిస్తున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 34 వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సోమవారం కలెక్టర్ చాంబర్ లో మేడారం జాతర పార్కింగ్ ప్రదేశాలపై, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఎడిషనల్ ఎస్పి సుధీర్ కేకన్, డి సి పి, గౌస్ సాలం సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతర దగ్గర పడుతున్నందువల్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని, పార్కింగ్ ప్రదేశాల్లో భూములను చదును చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. పార్కింగ్ ప్రదేశంలో గ్రావెల్, స్టోన్ డస్టు వేయించాలని అన్నారు పార్కింగ్ ప్రదేశాల్లో సిబ్బందికి నిధులు కేటాయించాలని తెలుపుతూ, గడువు తేదీలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పార్కింగ్ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Related posts

జగన్ కేసుల విచారణ లైవ్ టెలికాస్టు చేయాలి

Satyam NEWS

జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే: తస్లీమా మహమ్మద్

Bhavani

భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

Satyam NEWS

Leave a Comment